Vivo V29 Pro | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్లో త్వరలో వివో వీ29 5జీ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించనున్నది. వివో వీ29 5జీతోపాటు వివో వీ29 ప్రో 5జీ ఫోన్లు ఆవిష్కరిస్తుంది. 12 జీబీ రామ్‌తో వివో వీ29 5జీ ఫోన్ మార్కెట్లోకి వస్తున్నట్లు తలుస్తున్నది. ఆండ్రాయిడ్ -13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ మీద ఫోన్ పని చేస్తుంది. మదర్ బోర్డు కే6895వీ1, మీడియా టెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్ సెట్, 3.1 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుందని సమాచారం.
వివో వీ29 5జీ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + రిజొల్యూషన్ (2400×1080 పిక్సెల్స్) ఓలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది.
వివో వీ29 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్ కెమెరా లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ తో వస్తుందని సమాచారం. బ్లాక్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుందని తెలుస్తున్నది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.