Vivo T3 5G | వివో మిడ్ రేంజ్ ఫోన్ వివో టీ3 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Vivo T3 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో టీ3 5జీ ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Vivo T3 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిస్కరించింది. గతేడాది ఏప్రిల్ లో ఆవిష్కరించిన వివో టీ2 5జీ ఫోన్ కొనసాగింపుగా మిడ్ రేంజ్ ఫోన్ వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్ ను ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, అమోలెడ్ డిస్ ప్లే, డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటాయి. రెండు ర్యామ్ & స్టోరేజీ వేరియంట్లు, రెండు రంగుల్లో వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్ లభిస్తుంది. ఈ నెలాఖరు నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్ రెండు రంగులు – కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ కలర్స్‌లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు లభిస్తుంది. వివో ఇండియా ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్సెట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్.
వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతు, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 44వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 5జీ, 4జీ వోల్ట్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

