Vivo T2 Pro 5G | వివో నుంచి మరో మిడ్ రేంజ్ ఫోన్ వివో టీ2 ప్రో 5జీ.. ధరెంతంటే..?!
Vivo T2 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్లోకి తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఈ నెల 29 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
Vivo T2 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) భారత్ మార్కెట్లోకి తన మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వివో టీ2 ప్రో 5జీ (Vivo T2 Pro 5G) ఫోన్ ఆవిష్కరించింది. రెండు రంగుల ఆప్షన్లలో లభించే వివో టీ2 ప్రో 5జీ ఫోన్ కర్వ్డ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్సెట్ విత్ 8 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ (iQoo Z7 Pro 5G)ను రీబ్రాండ్ చేసి వివో టీ2 ప్రో 5జీ (Vivo T2 Pro 5G) ఫోన్ ఆవిష్కరించినట్లు తెలుస్తున్నది.
వివో టీ2 ప్రో 5జీ (Vivo T2 Pro 5G) పోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 పలుకుతుంది. టాప్ వేరియంట్ 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999లకు లభిస్తుంది. న్యూ మూన్ బ్లాక్, డ్యూన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 29 నుంచి వివో ఈ-స్టోర్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో సేల్స్ ప్రారంభం అవుతాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.2000 ఇన్స్టంట్ డిస్కౌంట్, అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.1000 వరకూ రాయితీ అందిస్తున్నది.
వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్13 వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తుంది. సెల్ఫీ కెమెరా కోసం కర్వ్డ్ డిస్ప్లేలో సెంట్రల్ నాచ్ ఉంటుంది. 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్ సెట్, 8జీబీ ర్యామ్ కెపాసిటీ ఉంటుంది. ఇందులో వర్చువల్‌గా మరో 8జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.
64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 2-మెగా పిక్సెల్ బొకెహ్ షూటర్ కెమెరా..సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెల్ఫీ షూటర్ కెమెరా ఉంటాయి. నైట్ మోడ్‌తోపాటు పనోరమ, టైమ్ ల్యాప్స్ వీడియో, డ్యుయల్ వ్యూ, పొర్ట్రైట్, స్లో మోషన్ తదితర మోడ్స్‌కు ఈ కెమెరా సెటప్ మద్దతుగా ఉంటుంది.
వివో టీ2 ప్రో 5జీ ఫోన్ (Vivo T2 Pro 5G) ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, గాలిలియో, క్యూజడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 సెన్సర్లకు కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలో మీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, గైరోస్కోప్ తదితర సెన్సర్లు ఉంటాయి. అథంటికేషన్ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది.
66వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది వివో టీ2 ప్రో 5జీ ఫోన్. కేవలం 22 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. సింగిల్ చార్జింగ్ పూర్తయితే 56.85 గంటల పాటు మ్యూజిక్ ప్లే బ్యాక్ బ్యాకప్ ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

