Vivo T2 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) గత ఏప్రిల్‌లో వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. తాజాగా వివో టీ2 సిరీస్‌లోనే వివో టీ2 ప్రో 5జీ ఫోన్ కూడా మార్కెట్లోకి తేనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్సెట్తో వస్తోంది.
ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ వేదికగానే వివో టీ2 ప్రో 5జీ ఫోన్లు విక్రయిస్తారు. ఈ ఫోన్ ధర రూ.23,999 ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. రెండు వేరియంట్లు- 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా వస్తుందని సమాచారం. ఎప్పుడు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్లు రెండూ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ పై పని చేస్తున్నాయి. వివో టీ2 5జీ ఫోన్ రూ.18,999, వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్ ధర రూ.12,999 నుంచి ప్రారంభం అవుతున్నాయి.