Vivo T2 Pro 5G | 22న భారత్ మార్కెట్లోకి వివో టీ2 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్.. ?!
Vivo T2 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్లో తన వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఈ నెల 22న ఆవిష్కరించనున్నది.
Vivo T2 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) .. భారత్ మార్కెట్లోకి తన వివో టీ2 ప్రో 5జీ (Vivo T2 Pro 5G) ఫోన్ వచ్చే వారం ఆవిష్కరించనున్నది. గత ఏప్రిల్‌లో వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ ఫోన్లు ఆవిష్కరించింది. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ ప్లే విత్ గోల్డెన్ షేడ్.. సెంట్రల్లీ అలైన్డ్ హోల్ పంచ్ కటౌట్‌తో వస్తోందని తెలుస్తున్నది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ సేల్స్ జరుగుతాయని ధ్రువీకరించింది.
ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు వివో టీ2 ప్రో 5జీ (Vivo T2 Pro 5G) ఫోన్ ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా వెబ్ పేజ్ క్రియేట్ చేసింది. ఈ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ సపోర్ట్ ఫర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో వస్తున్నది. రింగ్-షేప్డ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు సర్కిళ్లలో సెన్సర్లు ఉంటాయి. ఐక్యూ జడ్7 ప్రో5జీ ఫోన్ డిజైన్‌ను పోలి వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఉంటుంది.
వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ధర ఎంత అన్నది అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ తరహాలోనే రూ.23,999 ఉండొచ్చునని అంచనా. గత నెలలో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.22,999లకు ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ మార్కెట్లోక ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
వివో టీ2 ప్రో 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ విత్ 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో కూడిన డిస్ ప్లే ఉండొచ్చునని భావిస్తున్నారు. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్ సెట్, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

