ED on Vivo India | వివో ఇండియా పన్ను ఎగవేత రూ.62,476 కోట్లు?.. సగం టర్నోవర్ చైనాకు బదిలీ: ఈడీ వెల్లడి
ED on Vivo India | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. రూ.62,746 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడిందని ఈడీ ఆరోపించింది.
ED on Vivo India | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ( Vivo ) పన్ను ఎగవేతకు పాల్పడిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. అందుకోసం చైనాకు రూ.62,476 కోట్లు తరలించిందని గురువారం తెలిపింది. ఇది భారత్‌లో వివో టర్నోవర్ రూ.1.25 లక్షల కోట్లలో సగం ఉంటుందని వివరించింది. ఎంత కాలంలో వివో ఈ టర్నోవర్ సాధించిందన్న సంగతి ఈడీ అధికారులు వెల్లడించలేదు. రూ. వేల కోట్లలో జరిగిన ఈ హవాలా లావాదేవీల్లో పలువురు చైనీయులు, పలు భారత కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయని పేర్కొంది.
వివో కంపెనీపై నిఘా పెట్టిన ఈడీ.. ఆ స్మార్ట్ ఫోన్ సంస్థకు చెందిన ముగ్గురు చైనీయులు.. భారత్‌లో 2018-21 మధ్య భారత్‌ను భారత్‌ను వీడారని ఈడీ అధికారులు తెలిపారు. మరో వ్యక్తి భారత్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ గార్గ్ సాయంతో దేశంలో 23 కంపెనీలు స్థాపించాడని పేర్కొన్నారు. ఈ 23 కంపెనీలు భారీ మొత్తంలో వివో ఇండియాకు నిధులు బదిలీ చేశాయని, మొత్తం వివో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు రూ. 1,25,185 కోట్లని తేలినట్లు చెప్పారు. అందులో సగం రూ.62,476 కోట్లు చైనాకు వివో ఇండియా పంపేసిందని వెల్లడించారు.
భారత్‌లో పన్నుల ఎగవేతకు పాల్పడేందుకు సదరు 23 కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయని లెక్కలు చూపారని తెలిపారు. ఈ నెల ఐదో తేదీన వివో ఇండియాకు చెందిన 48 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన తర్వాత ఈడీ ఈ ప్రకటన చేసింది. ఇక వివోలో పని చేసిన చైనీయుల్లో ఒకరు బిన్ లూ.. వివో మాజీ డైరెక్టర్ అని ఆయన 2018 ఏప్రిల్‌లో భారత్‌ను వీడి వెళ్లారని ఈడీ అధికారులు చెబుతున్నారు. మరో ఇద్దరు జెన్షెన్ ఔ, ఝాంగ్ జై గతేడాది దేశాన్ని విడిచి వెళ్లిపోయారని అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

