Debit/Credit Card | ఆన్లైన్ పేమెంట్స్‌పై ఇండియన్స్ మోజు.. డెబిట్/ క్రెడిట్ కార్డులతో ఇవీ బెనిఫిట్లు..!
Debit/Credit Card | గతంతో పోలిస్తే ఆన్ లైన్ పేమెంట్స్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు పెరిగాయి. 130 కోట్లకు పైగా డెబిట్, 15 కోట్లకు పైగా క్రెడిట్ కార్డు చెల్లింపులు జరుగుతున్నాయి.
Debit/Credit Card | కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇండియన్స్ ఆన్లైన్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు బేస్డ్ పేమెంట్స్, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గుతున్నారు. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ), ఇండియా మాక్రో అడ్వైజర్స్ (ఐఎంఏ) నివేదిక ఈ సంగతి వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 130 కోట్ల పై చిలుకు డెబిట్ కార్డులు, 15 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు జరుపుతున్నారు.
ప్రస్తుతం ఏదేనీ బ్యాంకులో గానీ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలో ఖాతాలు తెరిచిన వారికి ఏటీఎం కం డెబిట్ కార్డులు ఆటోమేటిక్‌గా జారీ చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే తమ వద్ద ఉన్న డెబిట్ కార్డుల కంటే కొత్తగా పొందిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కొత్త డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఎంచుకున్న వారు.. వాటి నుంచి వచ్చే పలు ఆప్షన్లను వినియోగించుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు. ఆయా కార్డులతో లభించే బెనిఫిట్ల పట్ల అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ వీసా కార్డ్ జారీ చేస్తున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో లభించే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..!
క్లాసిక్ కార్డుతో లాభాలివీ
వీసా కార్డు జారీ చేస్తున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల్లో బేసిక్ కార్డు క్లాసిక్ కార్డు. దీని ఖాతాదారులకు గ్లోబల్ కస్టమర్ అసిస్టెన్స్ 24/7, ఎమర్జెన్సీ కార్డ్ రీప్లేస్మెంట్, అత్యవసర క్యాష్ అడ్వాన్స్ చెల్లింపులు పొందొచ్చు.
క్లాసిక్ కంటే బెటర్ బెనిఫిట్లు
క్లాసిక్ కార్డులతో వచ్చే ఆఫర్లకు అదనంగా వీసా గోల్డ్ కార్డు ఖాతాదారులకు బెనిఫిట్లు లభిస్తాయి. అంతర్జాతీయంగా చెల్లుబాటు, నగదు పంపిణీ సేవలు, ట్రావెల్ అసిస్టెన్స్, గ్లోబల్ ఏటీఎం నెట్వర్క్, ప్రపంచవ్యాప్తంగా డైనింగ్, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్, మెడికల్- లీగల్ రిఫరల్, రిటైల్ సేవలకు అసిస్టెన్స్, స్పెషల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్లాటినం కార్డుపై పలు ప్రయోజనాలు
వీసా ప్లాటినం కార్డులపై 24/7 సేవలతోపాటు డిస్కౌంట్లు, వందల డీల్స్, ప్రివిలైజెస్తోపాటు బెనిఫిట్లు పొందొచ్చు. ప్రయాణ టికెట్ల రిజర్వేషన్, తమ ప్రియమైన వారికి బహుమతుల కొనుగోళ్లపై ప్రయోజనాలు అందుకోవచ్చు. ప్లాటినం కార్డు ప్రయోజనాలు వీసా సిగ్నేచర్ కార్డు దారులకు లభిస్తాయి. సిగ్నేచర్ కార్డు దారులకు అదనంగా వీసా ఎయిర్పోర్ట్ లాంజ్ సౌకర్యం లభిస్తుంది.
ఇన్ఫినిట్ కార్డుతో లాభాలిలా
సిగ్నేచర్ వీసా కార్డుతో లభించే ప్రయోజనాలతోపాటు ఇన్ఫినిట్ కార్డులతో ఎక్స్‌పీరియన్షియల్ బెనిఫిట్లు పొందొచ్చు. దేశంలోని కొద్ది మంది మాత్రమే ఈ బెనిఫిట్లు పొందగలరు. ఇతర కార్డులతో పోలిస్తే ఇన్ఫినిట్ కార్డుపై అత్యంత హై ఎండ్ సర్వీసెస్, బెనిఫిట్లు పొందవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

