Virtual credit cards | వర్చువల్ క్రెడిట్ కార్డులు.. ఎలా వినియోగించాలో తెలుసా..?
Virtual credit cards | వర్చువల్ క్రెడిట్ కార్డులంటే డిజిటల్ క్రెడిట్ కార్డులు. ఇవి ఆన్లైన్లో లభిస్తాయి. వీటికి భౌతిక రూపం ఉండదు. అయినప్పటికీ సాధారణ క్రెడిట్, డెబిట్ కార్డులవలే కార్డు నంబర్, సీవీవీ, వ్యాలిడిటీ తేదీలుంటాయి. ఈ వివరాలన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయి.
వర్చువల్ క్రెడిట్ కార్డులంటే డిజిటల్ క్రెడిట్ కార్డులు. ఇవి ఆన్లైన్లో లభిస్తాయి. వీటికి భౌతిక రూపం ఉండదు. అయినప్పటికీ సాధారణ క్రెడిట్, డెబిట్ కార్డులవలే కార్డు నంబర్, సీవీవీ, వ్యాలిడిటీ తేదీలుంటాయి. ఈ వివరాలన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం చాలా ప్రధాన క్రెడిట్ కార్డు జారీదారులు ఈ వర్చువల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు. అయితే వినియోగదారులు వీటిని ఆన్లైన్ లావాదేవీల్లోనే వాడుకోగలరు.
ఫీచర్లు-లాభాలు
వర్చువల్ క్రెడిట్ కార్డులు వన్-టైమ్ యూసేజ్ ఆప్షన్‌తో వస్తాయి. ఒకసారి వచ్చిన కార్డు నంబర్‌తో 24 గంటల నుంచి 48 గంటల వరకు మాత్రమే లావాదేవీలు జరుపగలం. దుర్వినియోగం, దొంగతనం వంటి సమస్యలను వీటి ద్వారా కస్టమర్లు అధిగమించగలరు. ఒకవేళ ఈ కార్డు తమకు అక్కర్లేదనుకుంటే కార్డుహోల్డర్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదా బ్లాక్ చేసుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
వర్చువల్ క్రెడిట్ కార్డు అనేది మీ దగ్గరున్న క్రెడిట్ కార్డుకు ఆన్లైన్ రూపం. దీనికో యూనిక్ క్రెడిట్ కార్డు నంబర్ ఉంటుంది. మీ ఒరిజినల్ క్రెడిట్ కార్డు వివరాలు తెలుపకుండానే దాని ద్వారా ఆన్లైన్ కొనుగోళ్లు చేపట్టవచ్చు. వన్-టైమ్ కోడ్‌తో ఇది పనిచేస్తుంది. తొలుత కార్డు నంబర్‌ను ఇన్పుట్ చేయాలి. ఆపై వ్యాలిడిటీని ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీతో వెరిఫై చేసుకొని లావాదేవీని పూర్తిచేయవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

