న్యూఢిల్లీ, నవంబర్ 15: రక్తపోటు (బీపీ) నియంత్రణకుగాను గ్లాండ్ ఫార్మా తీసుకొచ్చిన జనరిక్ ఔషధానికి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ అనుమతి లభించింది. ఆంజియోటెన్సిన్ II ఇంజెక్షన్ 2.5 ఎంజీ/ఎంఎల్ సింగిల్ డోస్ సీసా మార్కెటింగ్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి ప్రాథమిక ఆమోదం వచ్చినట్టు బుధవారం ఈ హైదరాబాదీ ఔషధ రంగ సంస్థ తెలియజేసింది. కాగా, తుది అనుమతులు అందిన తర్వాత తమ మార్కెటింగ్ భాగస్వామితో కలిసి ఈ ప్రోడక్ట్‌ను మార్కెట్లో ప్రవేశపెడతామని ఈ సందర్భంగా గ్లాండ్ ఫార్మా స్టాక్ ఎక్సేంజీలకు స్పష్టం చేసింది.