US Visa to Indians | ఇక మనోళ్ల డాలర్ డ్రీమ్స్ సాకారమే.. ఈ ఏడాది 10 లక్షల అమెరికా వీసాలు!
US Visa to Indians | ఈ ఏడాది కేవలం భారతీయులకే పది లక్షలకు పైగా వీసాలు జారీ చేస్తామని అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి డొనాల్డ్ లూ తెలిపారు. హెచ్-1 బీ, ఎల్ వీసాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
US Visa to Indians | ఉన్నత విద్యా కోర్సులు.. అటుపైన మెరుగైన వేతన ప్యాకేజీ కావాలంటే..లేదు వ్యాపార అవకాశాలు కావాలన్నా సరైన కేంద్రం అగ్రరాజ్యం అమెరికా. అందుకే ఇండియన్స్ తమ పిల్లల్ని అప్పు చేసైనా అమెరికాలో ఉన్నత విద్యా కోర్సులకు పంపుతున్నారు. అక్కడ ఎంఎస్ తదితర ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసుకుని.. అటుపై టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగంలో చేరతారు. అమెరికాలో ఉద్యోగం అంటే కాసుల పంట పండినట్లే.. అమెరికా డాలర్లు మన కరెన్సీలోకి వచ్చే సరికి రూ.లక్షల్లోకి వచ్చేస్తుంది. అమెరికా పాలకులు సైతం ప్రతిభకు పట్టం కడుతున్నారు. వృత్తి నిపుణుల కోసం ప్రతి ఏటా భారీగా వీసాలు జారీ చేస్తుంది. అమెరికా.. ఆ వీసాల్లో అత్యధికంగా భారతీయులు, చైనీయులే పొందుతారు. ఈ ఏడాది పది లక్షలకు పైగా భారతీయులకు వీసాలు జారీ చేయాలని అమెరికా సంకల్పించింది. విద్యా సంస్థల్లో కోర్సులు ప్రారంభమయ్యే నాటికి భారతీయ విద్యార్థులకు విద్యార్థి వీసాలు జారీ ప్రక్రియ పూర్తి చేయాలని జో బైడెన్ సర్కార్ కసరత్తు చేస్తున్నది.
ఐటీ- ప్రోఫెషనల్స్ కోసం భారతీయులకు హెచ్-1బీ, ఎల్ 1 వీసాల జారీకి ప్రాధాన్యం ఇస్తామని అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) డొనాల్డ్ లూ.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికాలోని టెక్ కంపెనీలకు విదేశీ టెక్ నిపుణుల కోసం జారీ చేస్తున్న నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హెచ్-1బీ వీసా. భారతీయులు, చైనీయులపైనే అమెరికా టెక్నాలజీ కంపెనీలు పూర్తిగా ఆధార పడ్డాయి. లక్షల మంది ఐటీ నిపుణులు ప్రతి ఏటా ఈ రెండు దేశాల నుంచే అమెరికాకు వెళుతుంటారు. ఈ ఏడాది పది లక్షలకు పైగా వీసాల జారీకి చర్యలు చేపట్టామని డొనాల్డ్ లూ తెలిపారు. ఇది విద్యార్థి వీసాలు, ఇమ్మిగ్రెంట్ వీసాల్లో రికార్డుగా నిలుస్తుందన్నారు.
ఇతర విభాగాల్లో ప్రత్యేకించి బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) క్యాటగిరీ వీసాల కోసం తొలిసారి దరఖాస్తు చేసుకున్న భారతీయులు సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్నారు. వీసాల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సి రావడం భారతీయుల్లో ఆందోళనను పెంచుతున్నది. అమెరికాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ రెండో స్థానంలో నిలుస్తుంది.
`మేం వర్క్ వీసాలు `హెచ్-1బీ, ఎల్1 వీసా`ల జారీకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. భారతీయులకు ఇప్పుడు 60 రోజుల్లోపు వీసాలు జారీ చేస్తున్నాం. ఇందుకోసం అదనపు కాన్సులేట్ ఆఫీసర్లను నియమిస్తున్నాం. మా ఈ నిర్ణయం వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడానికి ఉపకరిస్తుంది` అని డొనాల్డ్ లూ తెలిపారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇటీవల టెక్ సంస్థల్లో ఉద్యోగాల ఉద్వాసనకు గురైన హెచ్-1 బీ వీసా దారుల అభ్యర్థనల మేరకు స్టేటస్ సర్దుబాటుకు హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటున్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

