ఎగుమతులకు టారిఫ్ సెగ.. గత ఐదు నెలల్లో యూఎస్ ఎగుమతులు 28 శాతం క్షీణత
దేశీయ ఎగుమతులకు టారిఫ్ సెగ గట్టిగానే తగిలింది. దేశీయ ఉత్పత్తులపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార సుంకాలను విధించడంతో ఎగుమతులు భారీగా కుంగాయి. ఈ ఏడాది మే నెల నుంచి అక్టోబర్ చివరినాటికి ఎగుమతులు 28 శాతానికి పైగా పడిపోయాయి.
- ప్రతీకార సుంకాల విధింపుతో వెనక్కి తగ్గిన ఎగుమతిదారులు
న్యూఢిల్లీ, నవంబర్ 29 : దేశీయ ఎగుమతులకు టారిఫ్ సెగ గట్టిగానే తగిలింది. దేశీయ ఉత్పత్తులపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార సుంకాలను విధించడంతో ఎగుమతులు భారీగా కుంగాయి. ఈ ఏడాది మే నెల నుంచి అక్టోబర్ చివరినాటికి ఎగుమతులు 28 శాతానికి పైగా పడిపోయాయి. దేశీయ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను 50 శాతానికి పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఎగుమతులు 6.31 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతైన 8.83 శాతంతో పోలిస్తే 28.5 శాతం తగ్గాయని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్) ఆందోళనను వ్యక్తంచేసింది. దేశీయ ఎగుమతుల్లో అత్యధికంగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రతీకార సుంకాలను విధించడం వల్లనే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయని జీటీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న పది శాతంగా ఉన్న టారిఫ్..ఆగస్టు 7 నాటికి సుంకాలను 25 శాతానికి పెంచింది. అలాగే అదే నెల చివరి నాటికి టారిఫ్‌ను రెండింతలు పెంచి 50 శాతానికి సవరించింది. అప్పటి నుంచి ఇదే టారిఫ్ అమలులో ఉన్నది. రష్యా చమురును కొనుగోలు చేసినందుకుగాను ట్రంఫ్ భారత్‌పై కక్ష కట్టి టారిఫ్‌ను అమాంతం పెంచారు. దీంతో దేశీయ తయారీదారులు అమెరికాను ఎగుమతులు తగ్గించి, ఇతర దేశాల్లో తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇంకా తెగని చర్చలు
టారిఫ్‌ల విధింపుపై భారత్-అమెరికా దేశాల మధ్యజరుగుతున్న చర్చలు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. త్వరలో శుభవార్త వింటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినప్పటికీ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులు భారత్‌లో పర్యటించి దేశీయ అధికారులతో చర్చలు జరిపినప్పటికీ తుది నిర్ణయం తీసుకోవడంలో మాత్రం జాప్యం జరుగుతున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అమెరికా వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. వీరి ప్రతిపాదనలపై ఆయా ప్రభుత్వాలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తున్నది. భారత్‌పై అత్యధిక టారిఫ్‌లను విధించిన అమెరికా.. చైనా, జపాన్ దేశాలపై మాత్రం కరుణ చూపించింది. చైనాపై 150 శాతం పన్ను విధించిన యూఎస్ ఆ తర్వాతి క్రమంలో దీనిని 30 శాతానికి కుదించింది. అలాగే జపాన్‌పై 15 శాతం టారిఫ్‌ను వసూలు చేస్తున్నది.
ఫార్మా, స్మార్ట్ఫోన్లు డౌన్
అమెరికాకు ఎగుమతయ్యే వాటిలో అత్యధికంగా ఉన్న ఫార్మాస్యూటికల్స్, స్మార్ట్ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు భారీగా నీరసించాయి. అక్టోబర్ నెల ఎగుమతుల్లో 40.3 శాతంగావున్న వీటి వాటా 25.8 శాతానికి పడిపోయింది. మే నెలలో 3.42 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగగా, అక్టోబర్ నెలకు 2.54 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ దేశాల మధ్య టారిఫ్ యుద్ధం తెరపైకి రావడంతో ఇనుప ఖనిజం, స్టీల్, అల్యుమినియం, రాగి, వాహన విడిభాగాల వాటా 7.6 శాతానికి పడిపోయింది. ఈ విభాగ ఎగుమతులు 23.8 శాతం తగ్గి 629 మిలియన్ డాలర్ల నుంచి 480 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. వీటితోపాటు జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, సోలార్ ప్యానెల్, టెక్స్టైల్స్, గార్మెంట్, కెమికల్స్, సముద్రపు ఉత్పత్తుల ఎక్స్‌పోర్ట్స్ కూడా 52.1 శాతం నుంచి 31.2 శాతానికి జారుకున్నాయి. విలువ పరంగా చూస్తే 4.78 బిలియన్ డాలర్ల నుంచి 3.28 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు జీఆర్‌టీఐ వెల్లడించింది. ఎగుమతుల వృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని జీటీఆర్ఐ సూచిస్తున్నది.
- మే నెల నుంచి అక్టోబర్ వరకు దేశీయ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 36 శాతం తగా ్గయి. వీటి విలువ 2.29 బిలియన్ డాలర్ల నుంచి 1.50 డాలర్లకు చేరుకున్నాయి.
- నెలవారీగా జూన్‌లో 2 బిలియన్ డాలర్లు కాగా, జూలై 1.53 బిలియన్ డాలర్లకు, ఆగస్టులో 964.8 మిలియన్ డాలర్లకు, సెప్టెంబర్ నెలలో 884.6 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కానీ, అక్టోబర్ నెలలో మాత్రం తిరిగి కోలుకుని 1.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
- ఔషధాల ఎగుమతులు 1.6 శాతం తగ్గుముఖం పట్టగా..పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 15.5 శాతం పతనం చెందాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

