MG Astor-2024| భారత్ మార్కెట్లోకి అప్డేటెడ్ ఎంజీ ఆస్టర్.. రూ.9.98 లక్షల నుంచి ప్రారంభం
MG Astor | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన పాపులర్ కంపాక్ట్ ఎస్యూవీ ఎంజీ అస్టర్ ఫేస్ లిఫ్ట్ (MG Astor) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
MG Astor-2024| ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన పాపులర్ కంపాక్ట్ ఎస్యూవీ ఎంజీ అస్టర్ ఫేస్ లిఫ్ట్ (MG Astor) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తొలిసారి 2021లో భారత్ మార్కెట్లో విడుదల చేసిన ఎంజీ ఆస్టర్ -2024 కారు పర్సనల్ ఏఐ అసిస్టెన్స్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వ్యవస్థతో వస్తోంది. 14 లెవెల్-2 ఇడాస్తోపాటు ఎంజీ ఆస్టర్ 2024 మోడల్ కారు 49కి పైగా సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంటుంది. పర్సనల్ ఏఐ అసిస్టెన్స్‌తో వస్తోంది.
ఎంజీ ఆస్టర్ తన 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్ కారు అన్ని వేరియంట్లను అప్ డేట్ చేసింది. న్యూ ఎంట్రీ లెవెల్ స్ప్రింట్ వేరియంట్ ధర రూ.9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి నుంచి ప్రారంభం అవుతుంది. ఇంతకుముందు బేస్ మోడల్ స్టైల్‌తో పోలిస్తే, కొత్త స్ప్రింట్ వేరియంట్ రూ.80 వేలు తక్కువ. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కంపాక్ట్ ఎస్యూవీ కార్లలో అత్యంత చౌక కారు ఇది. సిట్రోన్ సీ3 కంటే రూ.1000 తక్కువ.
సూపర్, స్మార్ట్ వేరియంట్ల స్థానంలో న్యూ షైన్, న్యూ సెలెక్ట్ వేరియంట్లు, టాప్ వేరియంట్ సెవీ మోడల్ కారు ధర రూ.18.68 లక్షలు పలుకుతుంది. అప్డేటెడ్ సెవీ వేరియంట్ కారు ధర రూ.17.90 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, ఫోక్స్ వ్యాగన్ టైగూర్, స్కోడా కుషాక్ మోడల్ కార్లతో పోటీ పడుతుంది. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్ లెస్ ఫోన్ చార్జర్, 360 డిగ్రీ ఎరౌండ్ వ్యూ కెమెరా, 14 లెవెల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్లతోపాటు 49 + సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
అన్ని వేరియంట్ ఆస్టర్ కార్లలో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రామాణికంగా ఉంటుంది. దీన్ని స్మార్ట్ 2.0 యూఐతో అప్ గ్రేడ్ చేశారు. జియో వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ ఎలాంగ్ విత్ వెదర్, న్యూస్, క్యాలిక్యులేటర్, వాయిస్ కమాండ్స్ ఫీచర్లు ఉన్నాయి. వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మద్దతుగా ఉంటుంది.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్తోపాటు ప్యాసింజర్ల సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అస్కెంట్ అండ్ డిస్కెంట్ కంట్రోల్, హీటెడ్ ఓఆర్వీఎం ఫీచర్లు ఉంటాయి. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ లేదా డిపార్చర్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఫీచర్లు కూడా ఉంటాయి.
ఎంజీ అస్టర్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.5-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (110 పీఎస్ విద్యుత్, 144 ఎన్ఎం టార్క్), 1.3 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ (140 పీఎస్ విద్యుత్, 220 ఎన్ఎం టార్క్) తో వస్తున్నది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, సీవీటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

