Ashwini Vaishnaw | ఏఐ నియంత్రణపై కేంద్రం నజర్.. ఎన్నికల తర్వాత చట్టం చేస్తామన్న అశ్వినీ వైష్ణవ్
Ashwini Vaishnaw | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణకు సార్వత్రిక ఎన్నికల తర్వాత చట్టం తీసుకొస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
Ashwini Vaishnaw | రోజురోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఏఐ ఆధారిత చాట్ బోట్లు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ సాయంతో రూపుదిద్దుకున్న డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సినీ ప్రముఖులు బాధితులుగా మారారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై నియంత్రణ తీసుకొస్తామని కేంద్రం చెబుతున్నది. ఏఐ టెక్నాలజీ నియంత్రణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని భావిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నియంత్రణకు చట్టం రూపకల్పన చర్యలు ప్రారంభిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం విషయమై స్వీయ నియంత్రణ అనేది ఎంత మాత్రమూ సరిపోదని, అది చట్టబద్ధంగా జరుగాలని ప్రభుత్వం భావిస్తు్న్నదని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించామని, సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో దఫా చర్చించి చట్టం తీసుకు వస్తామని చెప్పారు. క్రియేటివిటీ, కొత్త ఆవిష్కరణలకు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చట్టం రూపొందిస్తామన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

