తీపికబురు : 8.7 శాతానికి తగ్గిన నిరుద్యోగ రేటు

న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలు సడలించడంతో దేశంలో నిరుద్యోగ రేటు ఆరువారాల కనిష్ట స్థాయిలో 8.7 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం తాజా వారంలో 9.7 శాతానికి తగ్గగా, గ్రామీణ నిరుద్యోగం 8.2 శాతానికి పడిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. మేలో 14.7 శాతంగా ఉన్న పట్టణ నిరుద్యోగం పలు రాష్ట్రాలు లాక్డౌన్ లకు సడలింపులు ప్రకటించడంతో జూన్ 13తో ముగిసిన వారంలో 9.7 శాతానికి తగ్గింది.
ఇక గ్రామీణ భారతంలో మే నెలలో నిరుద్యోగ రేటు 10.63 శాతానికి ఎగబాకగా జూన్ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగ రేటు 8.23 శాతానికి పడిపోయింది. అసంఘటిత రంగంలో క్రమంగా కార్యకలాపాలు పెరగడంతో నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక గత ఏడాది కరోనా ముమ్మర దశలో ఉండగా దేశ నిరుద్యోగ రేటు 23.52 శాతంగా నమోదవగా ఈ ఏడాది జనవరి నాటికి ఆర్థిక వ్యవస్థ రికవరీకి అనుగుణంగా 6.52 శాతానికి దిగివచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cmie
- India
- unemployment
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

