న్యూఢిల్లీ, జనవరి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,774.78 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,062. 58 కోట్లతో పోలిస్తే 67 శాతం పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7.85 శాతం అధికమై రూ.15,520. 93 కోట్ల నుంచి రూ.16,739.97 కోట్లకు చేరుకున్నది. కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారని పేర్కొంది. నిర్వహణ ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 2.88 శాతం ఎగబాకి రూ.14,531. 04 కోట్లకు చేరుకున్నది.