Car Sales | కార్ల సేల్స్‌లో మారుతి టాప్.. హ్యుండాయ్ను పక్కకు నెట్టేసిన టాటా మోటార్స్!
Car Sales | గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో వెహికల్స్ విక్రయాల్లో 14 శాతం గ్రోత్ నమోదైంది. కార్ల అమ్మకాల్లో మారుతి టాప్-1లో కొనసాగగా, రెండో స్థానానికి టాటా మోటార్స్ చేరుకున్నది.
Car Sales | 2022తో పోలిస్తే గత నెలలో వాహనాల సేల్స్‌లో 13.89 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఎలక్ట్రానిక్ విడి భాగాల లభ్యత మెరుగు పడటం, రెండో దశ బీఎస్-6 ప్రమాణాల అమలు వంటి అంశాల నేపథ్యంలో గత నెలలో దాదాపు అన్ని సంస్థల సేల్స్ బెస్ట్ రికార్డులు నమోదు చేశాయి. కార్ల సేల్స్‌లో మారుతి సుజుకి తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. గత నెలలో 20,41,847 యూనిట్లు విక్రయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) తెలిపింది. 2022లో 17,92,802 యూనిట్లకు పరిమితమైంది. మారుతి సుజుకి అత్యధికంగా 1.37 లక్షల కార్లు విక్రయిస్తే, హీరోమోటో కార్ప్ 4.66 లక్షల బైక్స్, స్కూటర్లు విక్రయించింది. హ్యుండాయ్ మోటార్ ఇండియా స్థానాన్ని టాటా మోటార్స్ టేకోవర్ చేసింది.
2022తో పోలిస్తే గత నెలలో మారుతి సుజుకి కార్ల సేల్స్ 15.83 శాతం పెరిగాయి. గతేడాది మార్చిలో 1,18,446 కార్లు అమ్ముడైతే.. ఈ ఏడాది 18,755 యూనిట్ల సేల్స్ పెరిగి 1,37,201 యూనిట్లకు చేరాయి. తన ఉత్పత్తుల్లో పలు మార్పులు తెచ్చిన టాటా మోటార్స్ గతేడాది 36,939 కార్లు విక్రయిస్తే ఈ ఏడాది 46,847 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022తో పోలిస్తే 26.82 శాతం ఎక్కువ.
హ్యుండాయ్ మోటార్స్ గతేడాది 43766 కార్లు అమ్మితే ఈఏడాది 1937 యూనిట్లు (4.42 శాతం) పెంచుకుని 45,703 కార్లకు పెంచుకున్నది. గతేడాదితో పోలిస్తే మహీంద్రా అండ్ మహీంద్రా అదరగొట్టింది. గతేడాది మార్చిలో 24,014 కార్లు విక్రయించిన ఎం అండ్ ఎం ఈ ఏడాది 8,182 యూనిట్లు (34.07 శాతం) పెంచుకుని 32,196 కార్లు విక్రయించింది.
కియా మోటార్స్ గతేడాదితో పోలిస్తే 2023 మార్చిలో 20.64 శాతం ఎక్కువ కార్లను విక్రయించింది. గతేడాది మార్చిలో 17,426 యూనిట్లు విక్రయించిన కియా.. ఈ ఏడాది 21,023 కార్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ గతేడాది మార్చిలో 11,195 కార్లు అమ్మగా ఈ ఏడాది 39.55 శాతం వృద్ధితో 15,623 యూనిట్లకు పెరిగింది.
స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి కార్ల సేల్స్‌లో 8.21 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2022 మార్చి 7390 కార్లు, ఈ ఏడాది మార్చిలో 7,977 కార్లు విక్రయించింది. ఇక బజాజ్ ఆటో త్రీవీలర్స్ సేల్స్ 30,564 నమోదయ్యాయి. కమర్షియల్ వెహికల్స్ విభాగంలో 36,152 యూనిట్ల సేల్స్‌తో టాటా మోటార్స్ మొదటి స్థానంలో నిలిచింది. గత నెలలో ట్రాక్టర్ల విక్రయాలు 3.84 శాతం పెరిగాయి. 2022 మార్చిలో 78,070 ట్రాక్టర్లు అమ్ముడైతే గత నెలలో 81,067 యూనిట్లకు పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- auto sales
- Business news
- Cars
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

