మంటెక్కిన టమాట : రూ .100కి ఎగబాకిన కాయగూర!
నిమ్మకాయల ధరలు చుక్కలను తాకి షాక్ ఇచ్చిన కొద్దిరోజులకే టమాట ధరలు మంటెక్కాయి. దేశవ్యాప్తంగా ముంబై సహా పలు ప్రధాన నగరాల్లో కిలో టమాట ఏకంగా రూ 100కి చేరింది.
న్యూఢిల్లీ : నిమ్మకాయల ధరలు చుక్కలను తాకి షాక్ ఇచ్చిన కొద్దిరోజులకే టమాట ధరలు మంటెక్కాయి. దేశవ్యాప్తంగా ముంబై సహా పలు ప్రధాన నగరాల్లో కిలో టమాట ఏకంగా రూ 100కి చేరింది. టమాట ధరలు భారం కావడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. పలు వంటకాలకు రుచిని అందించే టమాట ధరలు ఎగబాకడంతో ఇది వంటింటికి దూరమవుతోంది.
ముంబైలోని దాదర్ మార్కెట్లో కిలో టమాట వంద రూపాయలు పలుకుతుండటంతో వినియోగదారులు వాటివైపు చూసేందుకు భయపడుతున్నారు. నిత్యావసర కూరగాయగా ప్రతి ఇంటా వాడే టమాట ధరలు ముంబై, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో సెంచరీకి చేరువయ్యాయి. టమాట ధరలు పెరగడంతో గృహిణులు ఈ కూరగాయ కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.
టమాట సరఫరాలు అరకొరగా ఉండటంతోనే ధరలు మండుతున్నాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక వంటి టమాట సాగు అధికంగా ఉండే రాష్ట్రాల్లో మార్చి-ఏప్రిల్‌లో వేడిగాలుల వల్ల దిగుబడి దెబ్బతినడం కూడా టమాట ధరలు మోతక్కడానికి కారణమని అంటున్నారు. మరో రెండు, మూడు వారాల వరకూ టమాట ధరలు దిగివచ్చే పరిస్ధితి కనిపించడం లేదని చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

