SBI Debit Card Blocking | గతంలో షాప్కెళ్తే పర్సులో డబ్బు పెట్టుకుని వెళ్లేవాళ్లం.. కాల క్రమేణా నిత్యావసర వస్తువులు మొదలు.. పెట్రోల్.. యుటిలిటీ సేవల బిల్లులు.. ప్రతి పేమెంట్ కూడా డెబిట్ కార్డులతోనే చేస్తున్నాం.. ఇప్పుడు నగదు లేకుండా బయటకు వెళ్లినా పర్వాలేదు గానీ.. డెబిట్ కార్డు లేకుండా బయటకెళ్లలేం.ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కూడా పెరిగాయి.
ఒకవేళ పొరపాటున డెబిట్ కార్డు ఎక్కడైనా పోగొట్టుకుంటే బ్యాంక్‌కు వెళ్లి కార్డ్ బ్లాక్ చేసే లోపు.. సైబర్ మోసగాళ్లకు ఆ కార్డు దొరికితే.. మన ఖాతాలో ఉన్న మొత్తం కాజేస్తారేమోనన్న ఆందోళన.. కానీ ఇప్పుడు ఆ అవసరమేమీ లేదు. బ్యాంకులు నెట్ బ్యాంకింగ్.. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డ్ బ్లాకింగ్ ఫెసిలిటీ కల్పిస్తున్నాయి.
దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ కూడా తమ కస్టమర్లకు చాలాకాలంగా ఈ ఫెసిలిటీ కల్పిస్తున్నది. ఇప్పుడు ఇంకా దాన్ని మరింత తేలిగ్గా ఐవీఆర్ సిస్టమ్‌లో డెబిట్ కార్డు వెంటనే బ్లాక్ చేయడంతోపాటు కొత్త కార్డు పొందే వెసులుబాటు తెచ్చింది. ఇందుకోసం ఖాతాదారులు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉండాలంటే కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాతో మొబైల్ నంబర్ తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి.