Hyundai Venue | వెన్యూ.. ఎక్స్టర్లపై హ్యుండాయ్ డిస్కౌంట్లు.. గరిష్టంగా రూ.55 వేలు..!
Hyundai Venue | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ తన కంపాక్ట్ ఎస్ యూవీ కారు వెన్యూపై గరిష్టంగా రూ.55 వేలు, ఎక్స్ టర్ కారుపై రూ.20 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.
Hyundai Venue | దేశీయంగా కార్ల మార్కెట్లో కంపాక్ట్ ఎస్ యూవీ కార్లకు ఫుల్ గిరాకీ నెలకొంది. ఈ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు అద్భుతమైన ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి తేవడానికి పోటీ పడుతున్నాయి. ఆ జాబితాలో మహీంద్రా ఎక్స్ యూవీ3ఎక్స్ఓ, మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి కార్లు ముందు వరుసలో ఉన్నాయి. వీటితోపాటు దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ వెన్యూ సైతం పోటీ పడుతోంది. హ్యుండాయ్ మోటార్ ఇండియా తన వెన్యూ కార్ల విక్రయాలు పెంచుకునేందుకు కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉన్న ఈ డిస్కౌంట్లలో గరిష్టంగా రూ.55 వేల వరకూ రాయితీ కల్పిస్తోంది.
రూ.55 వేల డిస్కౌంట్ లో కస్టమర్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హ్యుండాయ్ వెన్యూ కారు ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,24,307 వెన్యూ కార్లు అమ్ముడైతే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 28,337 యూనిట్లు అమ్ముడు పోయాయి.
హ్యుండాయ్ వెన్యూ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ల కప్పా ఎంపీఐ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (83 పీఎస్ విద్యుత్, 114 ఎన్ఎం టార్క్), 1.0 లీటర్ల కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ (120 పీఎస్ విద్యుత్, 172 ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ల యూ2 సీఆర్డీఐ వీజీటీ డీజిల్ (116 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్) ఇంజిన్లతో వస్తోంది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 1.0 లీటర్ల ఇంజిన్ కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7-స్పీడ్ డీసీటీ, 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యవల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
అంతే కాదు హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎస్ యూవీ కార్ల సెగ్మెంట్లో ఎక్స్ టర్, వెన్యూ, క్రెటా, అల్కాజర్, టస్కన్ వంటి కార్లతో ఇతర కార్ల తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. వెన్యూ తర్వాత ఎక్స్ టర్ మీద ఈ నెలాఖరు వరకూ రూ.20 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది హ్యుండాయ్.
ఇవి కూడా చదవండి :
Citroen Basalt | టాటా కర్వ్‌కు గట్టి పోటీ..ఆగస్టు 2న భారత్ మార్కెట్లోకి సిట్రోన్ బసాల్ట్..!
Bajaj Bikes – Flipkart | ఫ్లిప్ కార్ట్ ద్వారా బజాజ్ మోటారు సైకిళ్లకు ఆర్డర్లు.. !
Mahindra 5-Door Thar | ఆగస్టు 15న మార్కెట్లోకి మహీంద్రా 5-డోర్.. ఇవీ స్పెసిఫికేషన్స్..!
Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. కారణమిదేనా..?!
Google Pixel 9 Pro | గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం.. ఎప్పుడంటే..?!
Poco M6 5G | కొత్త వేరియంట్ లో పోకో ఎం6జీరామ్..ధరెంతంటే..?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

