iPhone 15 | డైనమిక్ ఐలాండ్‌తోపాటు ఐఫోన్15లో కీలక మార్పులివే.. !
iPhone 15 | ఆపిల్ ప్రతియేటా ఆవిష్కరించినట్లే ఈ ఏడాది ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు తీసుకొచ్చింది. అన్ని మోడల్ ఫోన్లలోనూ అప్ డేట్స్ తో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ జత చేసింది. కొత్తగా యూఎస్బీ సీ-పోర్ట్ చార్జర్ అందజేస్తోంది.
iPhone 15 | ప్రతియేటా కొత్త సిరీస్ ఐ-ఫోన్లు ఆవిష్కరించే టెక్ దిగ్గజం ఆపిల్.. అందరి అంచనాలకు అనుగుణంగానే వాటిల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన సిరీస్ ఐ-ఫోన్లలో ‘ప్రో’ మోడల్ ఫోన్లలో వినియోగించిన కీలక ఫీచర్లు బేస్ మోడల్ ఫోన్లలోనూ తీసుకొచ్చింది. తొలిసారి యూఎస్బీ-సీ పోర్ట్ చార్జర్‌తోపాటు యాక్షన్ బటన్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది.
ఐ-ఫోన్ 14 సిరీస్‌లో ఐ-ఫోన్ 14 ప్రో మోడల్ ఫోన్లో ఇచ్చిన డైనమిక్ ఐలాండ్ టెక్ ప్రియులను ఆకట్టుకున్నది. దీంతో తాజాగా విడుదల చేసిన అన్ని మోడల్ ఫోన్ల (ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్లస్) లో ఈ ఫీచర్ జత చేసింది. ఇక ముందు తీసుకొచ్చే అన్ని ఐ-ఫోన్లలోనూ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ స్టాండర్డ్‌గా కొనసాగనున్నదని సమాచారం.

ఫోన్ డిస్ ప్లే పై భాగంలో పిల్ ఆకారంలో గల కటౌట్లో కెమెరా, ఫేస్ ఐడీ సెన్సర్లు జత చేశారు. చూడటానికి అంతగా ఆకట్టుకోని ఈ ఫీచర్‌తో ఇన్ కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లు, మ్యూజిక్ ప్లే బ్యాక్ వంటి వాటిని నియంత్రించవచ్చు. అందుకోసం ఈ పిల్ కటౌట్లో సాఫ్ట్వేర్ యూఐ మార్చేసింది.
గత సిరీస్ ఐఫోన్లలో వాల్యూమ్ రాకర్ మీద మ్యూట్ లేదా వైబ్రేట్ బటన్ జత చేసేవారు. కానీ ఐ-ఫోన్ 15లో యాక్షన్ బటన్‌తో దాన్ని రీప్లేస్ చేశారు. ఈ బటన్ సాయంతో కెమెరా యాక్టివేషన్, ఫ్లాష్ లైట్ ఆన్, వాయిస్ మెమో, నోట్ ప్రారంభం, ఫోకస్ మోడ్ మార్పు వంటి ఫంక్షన్స్ నిర్వహించొచ్చు. ఇంతకుముందులాగే రింగ్ లేదా వైబ్రేట్ ఆప్షన్లు కూడా మార్చుకోవచ్చు. అదనంగా కొన్ని ఫంక్షన్లు జత చేసుకునే వెసులుబాటు ఉంది.

గతేడాది సిరీస్ వరకూ 12 మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా ఉంటే.. ఈ దఫా 48 మెగాపిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతో ఐ-ఫోన్ 15 రావడం ఆసక్తికరం. గతంలో ఐ-ఫోన్ ప్రో వేరియంట్లకు పరిమితమైన ఫ్రాస్టెడ్ గ్లాక్ బ్యాక్ ప్యానెల్.. ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్లస్ వేరియంట్లలోనూ వస్తుంది. టైటానియం డిజైన్‌తో వచ్చిన ఐఫోన్ 15 ప్రో ఫోన్ బరువు చాలా తగ్గుతుంది.
ఈ నెల 15 నుంచి భారత్‌లో ఐ-ఫోన్ల ప్రీ-ఆర్డర్లు మొదలవుతాయి. 22 నుంచి ఐ-ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని ఆపిల్ వెబ్సైట్ తెలిపింది. ఐ-ఫోన్ 15 రూ.79,900, ఐ-ఫోన్ 15 ప్లస్ రూ.89,900, ఐ-ఫోన్ 15 ప్రో రూ.1,34,900, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ.1,59,900లకు లభిస్తాయి. ఇక ఆపిల్ వాచ్ సిరీస్ 9 రూ.41,900, ఆపిల్ వాచ్ ఆల్ట్రా2 రూ.89,900లకు సొంతం చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

