న్యూఢిల్లీ, మార్చి 14: టోకు ధరల సూచీ మరింత తగ్గింది. జనవరి నెలకు గాను టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 0.2 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. అంతకుముందు నెలలో 0.27 శాతం గా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత నెలలో ఆహార ద్రవ్యోల్బణ సూచీ 6.85 శాతం నుంచి 6.95 శాతానికి చేరుకోగా, కూరగాయల సూచీ 19.71 శాతం నుంచి 19.78 శాతానికి ఎగబాకింది.