హైదరాబాద్ రియల్టీ హవా
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఇక్కడి రియల్టీ ఇండస్ట్రీ పరుగులు పెడుతున్నది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలపై అనరాక్ రిపోర్టు ఇచ్చింది.
- జోరుగా ఇండ్ల అమ్మకాలు
- జూలై-సెప్టెంబర్‌లో 41 శాతం వృద్ధి
- పెరుగుతున్న డిమాండ్‌తో ఎగబాకుతున్న ధరలు
- అనరాక్ తాజా గణాంకాల్లో వెల్లడి
రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్. అవును.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం అంతకంతకూ పెరుగుతూపోతున్నది. ఉపాధి-ఉద్యోగావకాశాలు, పార-పారిశ్రామికాభివృద్ధికి ఢోకా లేకపోవడం కలిసొస్తున్నది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజాగా విడుదల చేసిన రిపోర్టులోనూ ఇదే తేలింది. ఈ జూలై-సెప్టెంబర్‌లో ఇండ్ల అమ్మకాలు 41 శాతం ఎగబాకాయి. ఇక ధరల విషయానికొస్తే.. దేశంలోని మరే ఇతర ప్రధాన నగరాల్లో లేనట్టుగా 18 శాతం వృద్ధి కనిపించడం గమనార్హం.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఇక్కడి రియల్టీ ఇండస్ట్రీ పరుగులు పెడుతున్నది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలపై అనరాక్ రిపోర్టు ఇచ్చింది. ఇందులో నిరుడు జూలై-సెప్టెంబర్ వ్యవధితో పోల్చితే ఈసారి ఫ్లాట్లు, ఇండిపెండెట్ హౌజ్‌లు, విల్లా తదితర నివాస గృహ విక్రయాలు 36 శాతం ఎగిసినట్టు స్పష్టమైంది. హైదరాబాద్‌లో 41 శాతం పెరిగినట్టు తేలింది. నగరంలో పోయినసారి అమ్ముడైన హౌజింగ్ యూనిట్లు 11,650గా ఉంటే, ఈసారి 16,375 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం ఏడు నగరాల్లో ఈ జూలై-సెప్టెంబర్‌లో 1,20,280 యూనిట్లు అమ్ముడైనట్టు అనరాక్ తెలియజేసింది. పోయినసారి 88,230 యూనిట్లుగానే ఉన్నాయి. దీంతో ఆల్‌టైమ్ హైగా అనరాక్ పేర్కొంటున్నది.
ధరల్లో దూకుడు..
అనరాక్ వివరాల ప్రకారం హైదరాబాద్ ఇండ్ల ధరల్లోనూ భారీ పెరుగుదలే కనిపిస్తున్నది. నగరంలో గరిష్ఠంగా 18 శాతం వృద్ధి నమోదైంది. అనరాక్ తాజా రిపోర్టులో పేర్కొన్న దేశంలోని మరే ఇతర ప్రధాన నగరాల్లోనూ ఈ స్థాయిలో ఇండ్ల ధరల్లో పెరుగుదల లేకపోవడం గమనార్హం. మొత్తం ఏడు నగరాల్లో 11 శాతంగా ఉన్నది. కాగా, ఐటీ, ఫార్మా, ఏవియేషన్ తదితర రంగాల్లో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధి నేపథ్యంలోనే నానాటికీ ఇక్కడి ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నదని, అందుకు తగ్గట్టే ధరలూ పెరుగుతూపోతున్నాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి భూముల వేలంలోనూ రికార్డు స్థాయిలో ధరలు పలికిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆయా రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బలంగా నిలుస్తున్నాయంటున్నారు.
‘ఆయా నగరాల్లో అభివృద్ధి, లభిస్తున్న సౌకర్యాలు అక్కడి నివాసాలకు డిమాండ్‌ను తెచ్చిపెడుతున్నాయి. ఆర్బీఐ వరుస వడ్డీరేట్ల పెంపును ఆపేయడం కూడా నిర్మాణ రంగ పరిశ్రమలో కొంత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. గృహ రుణాలను పెంచుకునేందుకు బ్యాంకులు సైతం వడ్డీరేట్లలో ప్రత్యేక తగ్గింపులను ఇస్తుండటం కలిసొస్తున్నది. ఇటీవలికాలంలో లగ్జరీ ఇండ్లకూ పెద్ద ఎత్తునే డిమాండ్ వ్యక్తమవుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.’
-అనూజ్ పురి, అనరాక్ చైర్మన్

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

