ఆధునిక వసతుల హానర్ సిగ్నాటిస్
ప్రముఖ నిర్మాణ సంస్థ హానర్ హోమ్స్ హైదరాబాద్‌లో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో, విలాసవంతంగా ‘హానర్ సిగ్నాటిస్' బ్రోచర్‌ను గురువారం ఆవిష్కరించింది.
- 3 వేల కోట్లతో హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్
కొండాపూర్, ఆగస్టు 17: ప్రముఖ నిర్మాణ సంస్థ హానర్ హోమ్స్ హైదరాబాద్‌లో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో, విలాసవంతంగా ‘హానర్ సిగ్నాటిస్’ బ్రోచర్‌ను గురువారం ఆవిష్కరించింది. హైటెక్ సిటీ సమీపంలోని ఐడీఎల్ లేక్ రోడ్డులో రూ.3 వేల కోట్లతో 27.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించినట్లు కంపెనీ ప్రమోటర్, డైరెక్టర్ పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో రెరా అనుమతులతో 25 అంతస్థులతో 18 టవర్లుగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2026 నాటికి మొదటి ఫేజ్-1(9 బ్లాక్‌లు), ఆ తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఫేజ్-2ని వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. ఇందులో 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కేలను చదరపు అడుగుకు రూ.7,499 నుంచి రూ.7,999 ధరతో అందిస్తున్నట్లు చెప్పారు.
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఎమినిటీస్, స్పోర్ట్స్, క్లబ్ హౌజ్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు ప్రతి పార్కింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ పాయింట్లను కూడా నెలకొల్పుతున్నది. 78 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొనసాగుతున్న నిర్మాణంలో కేవలం 26 శాతం ఫుట్‌ప్రింట్, 74 శాతం ఓపెన్ ల్యాండ్‌గా కొనసాగిస్తున్నామన్నారు. ఐజీబీసీ నియమాలకు లోబడి నిర్మాణాలు చేపడుతున్నట్లు, అధిక మొత్తంలో గ్రీనరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 3 బీహెచ్‌కేలు 1622 కాగా, 3.5 బీహెచ్‌కేలు 1248, 4 బీహెచ్‌కేలు 396లు అందుబాటులో ఉండగా, మార్చి 2023లో వచ్చిన రెరా అనుమతుల నాటి నుంచి ఇప్పటి వరకు 1280కి పైగా ముందస్తు బుకింగ్‌లు వచ్చాయన్నారు.
హానర్ సిగ్నాటిస్ వివరాలు..
- 27.5 ఎకరాల స్థలంలో నిర్మాణం
- జీ+ 25 అంతస్థులు, 3,266 అపార్టుమెంట్లు
- 1,695-3,815 చ. అడుగుల్లో..
- రెండు స్విమ్మింగ్ పూల్స్, పెద్ద జిమ్
- ఐదు ఎకరాల్లో సెంట్రల్ పార్క్
- ఈవీ చార్జింగ్ స్టేషన్ కూడా..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

