Amara raja | బ్యాటరీ కింగ్ అమర రాజా.. తెలంగాణలో గిగా ఫ్యాక్టరీతో దేశీయ పరిశ్రమ మరింత బలోపేతం
అమర రాజా గ్రూప్.. భారతీయ బహుళజాతి వ్యాపార దిగ్గజం. ఆటోమోటివ్ రంగంలో దూసుకుపోతున్న ఈ తెలుగు రాష్ట్రాల సంస్థ.. ఇప్పుడు తెలంగాణలో ఓ గిగా ఫ్యాక్టరీని తెస్తున్నది. తద్వారా దేశీయ పరిశ్రమలో మరింత బలోపేతం కానున్నది.
- వ్యాపార విస్తరణలో మేటి
- బ్యాటరీ తయారీలో కంపెనీ దూకుడు
Amara raja | హైదరాబాద్, మే 6: అమర రాజా గ్రూప్.. భారతీయ బహుళజాతి వ్యాపార దిగ్గజం. ఆటోమోటివ్ రంగంలో దూసుకుపోతున్న ఈ తెలుగు రాష్ట్రాల సంస్థ.. ఇప్పుడు తెలంగాణలో ఓ గిగా ఫ్యాక్టరీని తెస్తున్నది. తద్వారా దేశీయ పరిశ్రమలో మరింత బలోపేతం కానున్నది. ఆటోమోటివ్ బ్యాటరీలు, బ్యాటరీ చార్జర్లు, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ బ్యాటరీలు, యూపీఎస్, డిజిటల్ ఇన్వర్టర్ల తయారీతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, ప్రాసెస్డ్ ఫుడ్ రంగాల్లో విస్తరించిన అమర రాజా గ్రూప్‌ది దాదాపు 40 ఏండ్ల చరిత్ర. 1985లో గల్లా రామచంద్ర నాయుడు చేతిలో పురుడు పోసుకున్న ఈ కంపెనీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తుండటం విశేషం. గల్లా జయదేవ్ అమ్మమ్మ, తాతల పేర్ల మీదుగా గ్రూప్‌నకు అమర రాజా పేరు పెట్టారు. కాగా, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడే గల్లా జయదేవ్ అన్నది తెలిసిందే.

జాన్సన్ కంట్రోల్స్‌తో..
ఆటోమోటివ్ బ్యాటరీల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ జాన్సన్ కంట్రోల్‌తో భాగస్వామ్యం ఏర్పర్చుకుని అమర రాజా గ్రూప్ 2001లో ఆటోమోటివ్ బ్యాటరీల వ్యాపార యూనిట్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే జీరో మెయింటెనెన్స్ టెక్నాలజీని పరిచయం చేసి భారతీయ ఆటోమోటివ్ బ్యాటరీ పరిశ్రమలో అమర రాజా సంచలనం సృష్టించింది. తద్వారా ఇండస్ట్రీకే దిక్సూచిగా నిలిచింది. ఇక 2010కిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన బిలియన్ డాలర్ల ఆదాయానికి దిగువన ఉన్న 200 అత్యుత్తమ ఆసియా సంస్థల జాబితాలోనూ అమర రాజా గ్రూప్ చోటు దక్కించుకున్నది. 2020కిగాను ఇన్నోవేటివ్ ప్రొడక్ట్/సర్వీస్ (జీపీఐపీఎస్ఏ) అవార్డును పొందింది. కాగా, గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితులను కల్పించేందుకూ ఓ కార్పొరేట్‌గా అమర రాజా ఎంతో కృషి చేస్తుండటం గమనార్హం. విద్య, ఉపాధి, ఆరోగ్య అవసరాలను తీరుస్తున్నది. కొత్తగా వచ్చే తెలంగాణ గిగా ఫ్యాక్టరీతోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సంస్థ అందిస్తున్నది.

అమర రాజా గ్రూప్
ప్రారంభం : 1985
ప్రధాన కేంద్రం : తిరుపతి
వ్యవస్థాపక చైర్మన్ : రామచంద్ర నాయుడు గల్లా
సీఎండీ : గల్లా జయదేవ్
దేశీయంగా ఉద్యోగులు : 15,216 (2020 నాటికి)
రంగాలు: ఆటోమోటివ్ బ్యాటరీ,
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రా, పవర్, ప్రాసెస్డ్ ఫుడ్-బేవరేజెస్, మీడియా
ఉత్పత్తులు : ఆటోమోటివ్ బ్యాటరీ, బ్యాటరీ చార్జర్లు, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ బ్యాటరీలు, ట్రికిల్ చార్జర్లు, యూపీఎస్, డిజిటల్ ఇన్వర్టర్లు
వార్షిక ఆదాయం : సుమారు రూ.9వేల కోట్లు
అనుబంధ సంస్థలు : అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, అమర రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అమర రాజా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్, అమర రాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, గల్లా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్
బ్రాండ్లు : అమరాన్, పవర్జోన్, అమరాన్ క్వాంటా, గల్లా, సిల్వర్ లైనింగ్ స్టోరేజ్ సొల్యూషన్స్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

