ప్రారంభ ధర రూ.4.49 లక్షలు
న్యూఢిల్లీ, మార్చి 14: రెనో.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎంట్రిలెవల్ క్విడ్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.49 లక్షలు. 0.8 లీటర్, 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ మ్యాన్వల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్లో సరికొత్త ఫీచర్స్‌తో రూపొందించింది. ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన మోడల్ 22.25 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.