హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా డిసెంబర్ 7,8,9న హైదరాబాద్లో భారీ స్థాయిలో రక్షా ఎక్స్పో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు.
ఈ మేరకు గురువారం సచివాలయంలో రక్షా ఎక్స్పో ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించేందుకు రక్షా ఎక్స్పో కీలక వేదికగా నిలువనున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.