Tecno Spark Go | చౌక ధరకే టెక్నో స్పార్క్ గో.. ఇవీ డిటైల్స్..!
Tecno Spark Go | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో భారత్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ‘టెక్నో స్పార్క్ గో 2024 (Techno Spark Go 2024) ఆవిష్కరించింది.
Tecno Spark Go | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Techno) భారత్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ‘టెక్నో స్పార్క్ గో 2024 (Techno Spark Go 2024) ఆవిష్కరించింది. రెండు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. యూనిసోక్ టీ606 చిప్‌సెట్‌తోపాటు 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. 5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
టెక్నో స్పార్క్ గో 2024 ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.6,699 కలిగి ఉంటుంది. తర్వాత 8 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లలో ఆవిష్కరిస్తుంది. గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల ఏడో తేదీ నుంచి అమెజాన్, ఇతర ప్రధాన రిటైల్ ఔట్లెట్లలో కొనుగోలు చేయొచ్చు.
టెక్నో స్పార్క్ గో 2024 ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) బేస్డ్ హెచ్ఐ ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. 6.56 అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ (720×1612 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డిస్ ప్లేకు పాండా స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న టెక్నో స్పార్క్ గో 2024 ఫోన్ 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, ఏఐ లెన్స్ డ్యుయల్ ఫ్లాష్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. బయోమెట్రిక్ అన్ లాక్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ ఫీచర్ కూడా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

