Tecno Pova 6 Pro 5G | 108-మెగా పిక్సెల్స్ కెమెరాతో టెక్నో పొవా 6ప్రో 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Tecno Pova 6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) సోమవారం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
Tecno Pova 6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) సోమవారం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో పోవా 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరించింది. 12 జీబీ ర్యామ్ తో వస్తున్న ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 70వాట్ల చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా గల ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇది డోల్బీ ఆట్మోస్ స్పాషియల్ సౌండ్‌కు మద్దతుగా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంటుంది.
ఈ నెలాఖరులో భారత్‌తోపాటు ఫిలిప్పైన్స్, సౌదీ అరేబియా మార్కెట్లలో టెక్నో పొవా 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరిస్తారు. తదుపరి దశలో ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికా దేశాల్లో ఆవిష్కరిస్తారు. కామెట్ గ్రీన్, మీటరైట్ గ్రే ఫినిష్ రంగుల్లో లభిస్తుంది. టెక్నో పొవా 5 ప్రో ఫోన్ కొనసాగింపుగా టెక్నో పొవా 6 ప్రో 5జీ ఫోన్ వస్తున్నది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తుంది.
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మద్దతుతో 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుందీ టెక్నో పొవా 6 ప్రో 5జీ ఫోన్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో వచ్చే కెమెరా హోల్ పంచ్ కటౌట్ హౌసింగ్ ఉంటుంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కలిగి ఉంటుంది. గేమింగ్ కోసం ఈ-స్పోర్ట్స్ ప్రో ఆపరేషన్ ఇంజిన్, 4డీ వైబ్రేషన్ సెన్స్ ఉంటుంది.
డోల్బీ ఆల్మోస్ స్పాషియల్ సౌండ్ మద్దతుతో వస్తున్న తొలి టెక్నో స్మార్ట్ ఫోన్ టెక్నో పొవా 6 ప్రో 5జీ. రేర్ ప్యానెల్‌పై 210 ఎల్ఈడీస్తో డైనమిక్ మినీ ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది. 70 వాట్ల చార్జింగ్, 10వాట్ల రివర్స్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 20 నిమిషాల్లో 50 శాతం, 50 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. చార్జింగ్ అయిన తర్వాత గేమింగ్ కోసం 11 గంటలకు పైగా, వీడియో స్ట్రీమింగ్ కోసం 14 గంటలకు పైగా, కాలింగ్ కోసం 31 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

