Tecno Camon 20 Premier 5G | టెక్నో నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఈ నెల 7న లాంచింగ్.. ఇవీ ఫీచర్లు..!
Tecno Camon 20 Premier 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. ఈ నెల ఏడో తేదీన భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ తేనున్నది. దీని ధర రూ.14,999 ఉండొచ్చునని సమాచారం.
Tecno Camon 20 Premier 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ (Tecno Camon 20 Premier 5G) ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల ఏడో తేదీన భారత్ మార్కెట్లో లాంచ్ చేయనున్నది. గత మే నెలలో గ్లోబల్ మార్కెట్లో టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. భారత్‌లో టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో 5జీ మోడల్ ఫోన్లు ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. ఇప్పటికైతే స్టోరేజీ ఆప్షన్లు, వాటి ధర ఎంత అన్న వివరాలు వెల్లడించలేదు. అయితే, టెక్నో కామన్ 20 ప్రో, బేస్ మోడల్ ఫోన్లు రూ.14,999లకే లభిస్తున్నాయి.
టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ ఎస్వోసీ, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ 6.67 – అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400×1080 పిక్సెల్స్) అమోలెడ్, విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ తో వస్తున్నది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 8జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ హెచ్ఐఓఎస్ 13.0 వర్షన్ మీద పని చేస్తుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా విత్ సెన్సర్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 108-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా విత్ ఒక్టా ఫ్లాష్ లేదా రింగ్-ఫ్లాష్ ఆప్షన్ కూడా ఉంటుంది. సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా లభిస్తుంది.
టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 45 వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ, ఓటీజీ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూ టూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అథంటికేషన్ కోసం డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

