త్వరలో ‘టీ హబ్ రోడ్‌మ్యాప్’
సంస్థాగత ఆవిష్కరణలకు 2030 పేరుతో ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను టీ హబ్ రూపొందిస్తున్నదని, ఇందులో టెక్నాలజీ సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నామని టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాస రావు తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): సంస్థాగత ఆవిష్కరణలకు 2030 పేరుతో ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను టీ హబ్ రూపొందిస్తున్నదని, ఇందులో టెక్నాలజీ సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నామని టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాస రావు తెలిపారు. టీ హబ్- అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో 200 మంది సీనియర్ బిజినెస్, టెక్నాలజీ లీడర్స్‌తో వ్యక్తిగతంగా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని, దీనికి అనుగుణంగానే దేశ వ్యాప్తంగా ఉన్న బిజినెస్, టెక్నాలజీ లీడర్లతో సమావేశమై 2030 నాటికి ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రత్యేకంగా చర్చించామన్నారు. ఇప్పటికే టీ హబ్- అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంయుక్తంగా యాక్టివేట్ అండ్ స్టార్టప్ ర్యాంప్‌ను నిర్వహిస్తే 330 దరఖాస్తులు ఢిల్లీ, ముంబై, పాట్నా, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి వచ్చాయన్నారు. డ్రోన్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాన్ని అందించేలా ఆయా పరిశ్రమలకు చెందిన సంస్థలతో కలిసి పనిచేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇలాంటి కార్యక్రమాలను దశల వారిగా చేపడుతూనే ఉంటామని తెలిపారు.
టీ హబ్ స్టార్టప్‌కు రూ.40లక్షల నిధులు…
టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ స్టార్‌బజ్ ఏఐకు రూ.40 లక్షల నిధులు సమకూరాయి. ఫ్రీ సీడ్ ఫండ్ ద్వారా వచ్చిన ఈ నిధులు కంపెనీ వృద్ధికి తోడ్పాటునందించనున్నది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ స్టార్టప్ వ్యాపార సంస్థల బ్రాండింగ్పైన, మార్కెట్లో ఉండే ఇన్ప్లూయెన్సర్స్తో కలిసి పనిచేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

