Income Tax | ఐటీఆర్ ఫైలింగ్.. కొన్ని టిప్స్ పాటిస్తే ఇలా రిలీఫ్
ఐటీఆర్ ఫైలింగ్‌లో కొన్ని టిప్స్ పాటిస్తే రిలీఫ్ పొందొచ్చు. హెల్త్ బీమా, ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకున్నా డిడక్షన్ క్లయిమ్ చేయవచ్చు.
Income Tax | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయం పన్ను శ్లాబ్‌ల్లో గానీ, స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్లో గానీ ఎటువంటి మార్పులు చేయలేదు. అయినప్పటికీ పన్ను చెల్లింపు ప్రక్రియను సరళతరం చేశారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన రెండేండ్లలోపు ఆ వివరాలను అప్డేట్ చేసేందుకు అనుమతించారు. ప్రస్తుతం మూడు నెలల గడువు మాత్రమే ఇచ్చారు. అయితే, ఐటీ రిటర్న్స్ పత్రాల అప్డేటింగ్ సమయంలో అదనపు పన్ను చెల్లించాల్సి రావచ్చు. కానీ, ఐటీఆర్ దాఖలు సమయంలో కొన్ని టిప్స్ పాటిస్తే అదనపు పన్ను చెల్లింపు భారం నుంచి బయటపడొచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ కింద రూ.లక్ష వరకు డిడక్షన్
కరోనా మహమ్మారి వచ్చాక ప్రతి ఒక్కరూ తమకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అని భావిస్తున్నారు. దీని ప్రకారం ఆదాయం పన్ను చట్టంలోని 80డీ సెక్షన్ కింద మెడికల్ ఇన్సూరెన్స్ కోసం మీ వ్యక్తిగతంగానూ, కుటుంబ పరంగానూ రూ.25 వేల ప్రీమియం వరకు పన్ను డిడక్షన్‌కు క్లయిమ్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు రూ.50 వేల వరకు మినహాయింపు క్లయిమ్ కోరవచ్చు. ఎవరైనా వ్యక్తులు తమ తల్లిదండ్రులకు విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 60 ఏండ్లు దాటి వారి కోసం రూ.50 వేల వరకు అదనపు డిడక్షన్ పొందేందుకు అర్హులు. ఇది అత్తామామలకు వర్తించదు.
ఇలా ఈపీఎఫ్ అడ్వాన్స్ టాక్స్ ఫ్రీ
కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్‌వోలో సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతా నుంచి నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. వారి కనీస వేతనం ప్లస్ మూడు నెలల డీఏ గానీ, పీఎఫ్ ఖాతా మొత్తం సొమ్ములో 75 శాతం వరకు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. ఈ అడ్వాన్స్‌పై పన్ను భారం ఉండదని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) క్లారిఫై చేసింది.
కోవిడ్ రిలీఫ్ మినహాయింపు ఇలా
ఒక వ్యక్తిగా లేదా యాజమాన్యం గానీ ఎవరైనా ఒక వ్యక్తి కోవిడ్ అనుబంధ చికిత్స కోసం పంపిన సొమ్ముపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ కోవిడ్‌తో మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు చేసే సాయంపైనా పన్ను చెల్లించనవసరం లేదు. అయితే, సదరు వ్యక్తి మరణించడానికి 12 నెలల్లోపు ఆ సాయం తీసుకోవాలి. ఏదైనా సంస్థ మినహా వ్యక్తులు రూ.10 లక్షల వరకు మాత్రమే చెల్లించడానికి అనుమతి ఉంది.
75 ఏండ్లు దాటితే నో రిటర్న్స్
75 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులకు పెన్షన్, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై ఐటీఆర్ దాఖలు చేయనవసరం లేదు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నా, పెన్షన్, దాని అనుబంధ బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌పై వడ్డీ కాకుండా ఎక్కువ ఆదాయం వచ్చినా ఈ రిలీఫ్ ఉండదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

