Tata Punch CNG | టాటా పంచ్ సీఎన్జీ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం..!
Tata Punch | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా పంచ్ సీఎన్జీ కార్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల వారు రూ.21 వేల టోకెన్ మొత్తం కట్టి బుక్ చేసుకోవచ్చు.
Tata Punch CNG | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన తొలి మైక్రో ఎస్యూవీ కారు ‘టాటా పంచ్’ సీఎన్జీ వేరియంట్ త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో టాటా పంచ్ కోసం కస్టమర్ల నుంచి టాటా మోటార్స్ డీలర్లు ప్రీ-బుకింగ్స్ స్వీకరిస్తున్నారు.
టాటా పంచ్ కొనుగోలు చేయనున్న వారు రూ.21,000 టోకెన్ మనీ చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. 2023 ఆటో ఎక్స్పోలో ‘టాటా పంచ్ సీఎన్జీ’ వేరియంట్ కారును ఆవిష్కరించింది టాటా మోటార్స్. దీంతో ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వచ్చిన తొలి మైక్రో ఎస్యూవీ కారు ఇదే. మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా పంచ్ సీఎన్జీ.. ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన హ్యుండాయ్ ఎక్స్టర్’తో తలపడనున్నది.
ఇప్పటికే టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రనున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో సీఎన్జీ సెగ్మెంట్’లోకి టాటా మోటార్స్ ఎంటరైంది. తొలుత టియాగో సీఎన్జీ, టైగోర్ సీఎన్జీని ఆవిష్కరించింది. ట్విన్ సిలిండర్ సిస్టమ్తో ఆల్ట్రోజ్ సీఎన్జీ మార్కెట్లో ఆవిష్కరించింది టాటా మోటార్స్.
టాటా పంచ్ సీఎన్జీ ట్విన్ సిలిండర్ ట్యాంక్ సెటప్ (30 లీటర్ల కెపాసిటీ గల 2 సీఎన్జీ సిలిండర్లు) 60 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది కారులో బూట్ స్పేస్ తగ్గించదు. పెట్రోల్ వేరియంట్ కారులో 366 లీటర్ల కెపాసిటీ గల బూట్ స్పేస్ ఉంటది.
టాటా పంచ్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 84 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్ 76 బీహెచ్పీ విద్యుత్, 97 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తోపాటు 5-స్పీడ్ ఏఎంటీ వర్షన్ కూడా ఉంది. టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ 26, టాటా పంచ్ సీఎన్జీ 27 కి.మీ మైలేజీ ఇస్తుంది.
టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ కారు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆటోమేటిక్ ఏసీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, 7-అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 7-అంగుళాలతోపాటు పుష్ బటన్ స్టార్ట్ లేదా స్టాప్ ఇంచ్ హర్మాన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటాయి.
క్రూయిజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, లెదర్ అప్హోల్స్టరీ, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆర్16 డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ ఆంటీనా, ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎం తదితర ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ తో పోలిస్తే టాటా పంచ్ సీఎన్జీ కారు రూ.లక్ష ఎక్కువ ఉండొచ్చు. ప్రస్తుతం టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్ ఢిల్లీలో రూ.6 లక్షల నుంచి రూ.9.54 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

