Tata Punch iCNG | మార్కెట్లోకి టాటా పంచ్ సీఎన్జీ.. రూ.7.1 లక్షల నుంచి ప్రారంభం
Tata Punch iCNG | టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి తన మైక్రో ఎస్యూవీ కారు పంచ్ ఐసీఎన్జీ వేరియంట్ ఆవిష్కరించింది. దీని ధర రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది
Tata Punch iCNG | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన మైక్రో ఎస్యూవీ పంచ్ సీఎన్జీ వేరియంట్ కారును శుక్రవారం మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. టాటా పంచ్ ఐసీఎన్జీ కారు ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వస్తున్నది. ఇందులో మెరుగైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రీఫ్యుయలింగ్, ఇంజిన్ నుంచి వాతావరణంలోకి గ్యాస్ రిలీజ్ కాకుండా చూడటంతోపాటు థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ కోసం కారు స్విచ్ఛాఫ్ చేయడానికి మైక్రో స్విచ్ ఉంటుంది.
వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హర్మాన్ ఆధ్వర్యంలో 7- అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, రైన్ సెన్సింగ్ వైపర్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
టాటా టియాగో, టాటా టైగోర్ మోడల్ కార్లలోనూ ట్విన్ సిలిండర్ టెక్నాలజీ వినియోగించారు. టియాగో ఐసీఎన్జీ కారు ధర రూ.6.55 లక్షల నుంచి రూ.8.1 లక్షల మధ్య, టైగోర్ ఐసీఎన్జీ కారు ధర రూ.7.8 లక్షల నుంచి రూ.8.95 లక్షల వరకు పలుకుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

