TaMo gets Sanand Ford Unit | టాటా మోటార్స్ చేతికి ఫోర్డ్ సనంద్ ప్లాంట్.. గుజరాత్ సర్కార్ ఓకే
TaMo gets Sanand Ford Unit | గుజరాత్‌లోని సనంద్ ఫోర్డ్ యూనిట్‌ను టాటా మోటార్స్ టేకోవర్ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
TaMo gets Sanand Ford Unit | అహ్మదాబాద్‌కు సమీపంలోని ఫోర్డ్ ఇండియా సనంద్ కార్ల తయారీ యూనిట్‌ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకోనున్నది. ఈ మేరకు ఫోర్డ్ ఇండియా, టాటా మోటార్స్ మధ్య కుదిరిన ఒప్పంద ప్రతిపాదనను గుజరాత్ ప్రభుత్వం ఆమోదించింది. ఫోర్డ్ నుంచి టాటా మోటార్స్‌కు సనంద్ ప్లాంట్‌కు అప్పగించేందుకు గతవారం గుజరాత్ సర్కార్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది.
టాటా మోటార్స్, ఫోర్డ్ మధ్య సోమవారం ఎంవోయూ ( అవగాహనా ఒప్పందం – Memorandum Of Understanding -MOU ) కుదురుతుందని ఒక ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం వచ్చింది. ఫోర్డ్ ఇండియాకు గుజరాత్ ప్రభుత్వం కల్పించిన ఇన్సెంటివ్‌లు టాటా మోటార్స్‌కు కూడా వస్తాయి. అయితే, ఈ డీల్‌కు సంబంధించి కార్మికుల భద్రత, ఆర్థికాంశాలు, డ్యూటీలు, బెనిఫిట్లు తదితర అంశాలపై ఇరు సంస్థలు ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నాయి. వివిధ అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేస్తాయని సమాచారం.
భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది ఈ అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్ట్ ప్రకటించింది. గత ఏప్రిల్ నుంచే గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్ నుంచి కార్ల ఉత్పత్తి నిలిపివేసింది. ఇప్పటికే భారత మార్కెట్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్న ఫోర్డ్.. విదేశాలకు ఎగుమతి చేయడానికి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నది. పీఎల్ఐ కింద ఫోర్ట్‌కు ఇన్సెంటివ్‌లు ఇవ్వడానికి కేంద్రం కూడా సరేనన్నది.
కానీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు పూర్తిగా భారత్ మార్కెట్ నుంచే నిష్క్రమించాలని నిర్ణయించినట్లు ఇటీవలే ఫోర్డ్ అధికారికంగా ప్రకటించింది కూడా. తొలుత పీఎల్ఐ కింద ఈవీ కార్లను గుజరాత్ యూనిట్ నుంచే ఉత్పత్తి చేయాలని ఫోర్డ్ భావించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

