సరికొత్త ఫీచర్లతో టాటా హారియర్ XMS & X-MAS
Tata Harrier XMS & XMAS | సరికొత్త ఫీచర్లతో టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి హారియర్ ఎక్స్‌ఎంఎస్, ఎక్స్-మాస్ కార్లు తీసుకొచ్చింది.
Tata Harrier XMS & XMAS | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి తన హారియర్ మోడల్ ఎస్యూవీ కార్లలో ఎక్స్‌ఎంఎస్, ఎక్స్-మాస్ వేరియంట్లను తీసుకొచ్చింది. హారియర్ ఎక్స్‌ఎంఎస్ ఎస్యూవీ కారు ధర రూ.17.20 లక్షల నుంచి మొదలవుతుంది. ఆటోమేటిక్ హారియర్ ఎక్స్‌ఎంఎస్ ధర రూ.18.50 లక్షలతో ప్రారంభం అవుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్‌తో సహా హారియర్ ఎక్స్‌ఎంఎస్, ఎక్స్-మాస్ వేరియంట్లలో పలు కొత్తఫీచర్లు ఉన్నాయి.
హారియర్ ఎక్స్‌ఎంఎస్, ఎక్స్-మాస్ వేరియంట్ కార్లలో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఐఆర్ఏ (iRA) కనెక్టెడ్ కార్ టెక్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎంస్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 5-సీటర్ ఎస్యూవీ కారు టాటా హారియర్‌లో 2.0 లీటర్ల సామర్థ్యం గల టర్బో చార్జిడ్, 4- సిలిండర్, క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 3750 ఆర్పీఎం వద్ద 170 బీపీహెచ్ ఇంధనం, 1750 ఆర్పీఎం వద్ద 350 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా వస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ హారియర్ లీటర్‌పై 16.35 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లు 14.6 కి.మీ. మైలేజీ ఇస్తాయి.
పలు ఎయిర్‌బ్యాగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిస్కెంట్ కంట్రోల్, ఆటో డ్రిమ్మింగ్ ఐఆర్వీఎం, రివర్స్ పార్కింగ్ సెన్సర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

