Tata Harrier-Safari | 17న మార్కెట్లోకి అప్డేటెడ్ టాటా హారియర్.. సఫారీ.. ఇవీ డిటైల్స్
Tata Harrier-Safari | టాటా మోటార్స్ తన అప్ డేటెడ్ హారియర్, సఫారీ ఎస్ యూవీ కార్లను ఈ నెల 17న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Tata Harrier-Safari | టాటా మోటార్స్ (Tata Motors) తన పాపులర్ ఎస్యూవీ కార్లు సఫారీ (Tata Safari), హారియర్ (Tata Harrier) మోడల్ కార్లు ఈ నెల 17న మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. రెండు మోడల్ కార్లలోనూ మరింత మెరుగు పడిన మైలేజీతో డీజిల్ ఇంజిన్ వేరియంట్లనూ ఆవిష్కరిస్తుంది. రెండు కార్లూ లీటర్ పెట్రోల్‌పై 16 కి.మీ.లకు పైగా మైలేజీ ఇస్తాయని టాటా మోటార్స్ తెలిపింది.
అప్డేటెడ్ టాటా హారియర్, టాటా సఫారీ ఎస్‌యూవీలు.. లాండ్ రోవర్ డీ8 ప్లాట్ ఫామ్‌తో స్ఫూర్తి పొందిన ‘ఒమెగా మార్క్`తో నిర్మించారు. సేఫ్టీ కోసం రెండు కార్లలోనూ రెండో దశ అడాస్ సిస్టమ్, సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ జత చేశారు. ఇప్పటికే కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అధికారిక వెబ్ సైట్, లేదా డీలర్ల వద్ద రూ.25 వేలు టోకెన్ మొత్తం పే చేసి బుక్ చేసుకోవచ్చు.
కొత్త టాటా సఫారీ, టాటా హారియర్ ధరలు ఎంతన్న సంగతి టాటా మోటార్స్ వెల్లడించలేదు. ప్రస్తుత మోడల్స్ ధరల కంటే ఎక్కువగా ఉండొచ్చునని భావిస్తున్నారు. టాటా సఫారీ ధర రూ.15.85 లక్షల నుంచి రూ.25.21 లక్సల మధ్య (ఎక్స్ షోరూమ్), టాటా హారియర్ రూ.15.20 లక్షల నుంచి రూ.24.27 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యూవీ700, మహీంద్రా స్కార్పియో, హ్యుండాయ్ అల్కాజర్ కార్లతో టాటా సఫారీ పోటీ పడుతుంది. జీప్ కంపాస్, ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ కార్లతో పడుతుంది టాటా హారియర్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

