Tata Approaches CCI | సీసీఐతో టాటా సన్స్ భేటీ.. ఆ రెండు సంస్థల విలీనానికేనా!
Tata Approaches CCI | తమ సంస్థలో ఎయిర్ ఏషియా విలీనంపై సీసీఐని టాటా సన్స్ అనుబంధ ఎయిరిండియా సంప్రదించింది.
Tata Approaches CCI | టాటా సన్స్ అనుబంధ ఎయిరిండియా బుధవారం యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను సంప్రదించింది. దేశంలోనే లో కాస్ట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మహరాజా (ఎయిరిండియా) ప్రతినిధులు సీసీఐని కలిసినట్లు తెలుస్తున్నది. ఎయిర్ఏషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లోని పూర్తి వాటాను చేజిక్కించుకోవాలని ఎయిరిండియా ప్రతిపాదన.
ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ పరోక్షంగా పూర్తిగా టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) అనుబంధ సంస్థ. ఎయిర్ ఏషియా ఇండియాలో టీఎస్‌పీఎల్‌కు 83.67 శాతం వాటా ఉంది. ఈ మేరకు ఎయిరిండియాలో ఎయిర్ ఏషియా ఇండియా విలీనం కోసం నోటీసు ఇచ్చినట్లు మహరాజా వర్గాలు చెప్పాయి. ఈ రెండు సంస్థలకు దేశీయ విమానయాన మార్కెట్లో 15.7 శాతం వాటా ఉంటుంది. ఎయిరిండియా అనుబంధ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ జాతీయ విమాన సర్వీసులను నడుపదు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కేవలం భారత్-గల్ఫ్ దేశాల రూట్ల మధ్యే సర్వీసులు నిర్వహిస్తుంది.
మహరాజా (ఎయిరిండియా) టేకోవర్ బిడ్ గెలుచుకోవాలంటే టాటా సన్స్‌కు ఏదేనీ విమానయాన సంస్థలో మెజారిటీ వాటా కలిగి ఉండాలి. అందుకోసం 2020 డిసెంబర్లోనే ఎయిర్ ఏషియా ఇండియాలో తన వాటాను 83.67 శాతాన్ని పెంచింది. మిగతా 16 శాతాన్ని ఎయిర్ఏషియా బెర్హద్ వద్ద నుంచి ఈ నెలాఖరులోగా టాటా సన్స్ చేజిక్కుంచుకుందామని ప్రణాళికలు రచించింది.
ఇక టాటా సన్స్ అనుబంధ సంస్థ విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ఎయిరిండియాతో అనుసంధానించడానికి చాలా టైం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 49 శాతం వాటా గల సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయి. గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియా మేనేజ్మెంట్ బాధ్యతలు టేకోవర్ చేసిన టాటా సన్స్.. తన ఆధీనంలోని అన్ని విమాన యాన సంస్థలను ఒక గొడుగు కిందకు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

