Tata Avinya | జాగ్వార్ ప్లాట్‌ఫామ్‌పై టాటా అవిన్యా కాన్సెప్ట్‌తో సరికొత్త ఈవీ కార్లు.. ఇక కార్ల తయారీ సంస్థలకు చుక్కలే..!
Tata Avinya | జాగ్వార్ లాండ్ రోవర్ ఆధ్వర్యంలోని ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్.. ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ సాయంతో అత్యాధునిక ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతున్నది.
Tata Avinya | ఎలక్ట్రిక్ కార్లలో దూకుడుగా ముందుకెళ్తున్న దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో కూడిన ఎస్యూవీ ఈవీ కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. ఇందుకోసం జాగ్వార్ లాండ్ రోవర్ ఆధ్వర్యంలోని ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్.. ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్`తో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం) అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. టీపీఈఎం నుంచి రాయాల్టీ ఫీజు తీసుకుంటూ తన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ పంచుకుంటుంది.
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆధ్వర్యంలో త్వరలో మార్కెట్లోకి రానున్న థర్డ్ జనరేసన్ ఈవీ కార్లలో జేఎల్ఆర్ ఈఎంఏ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీని వినియోగించనున్నారు. 2025 నుంచి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లను టాటా మోటార్స్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తుంది. జేఎల్ఆర్ ఈఎంఏ టెక్నాలజీని ఈ ఎస్‌యూవీల్లో వినియోగించనున్నారు.
జాగ్వార్ లాండ్ రోవర్ ఈఎంఏ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీతో టాటా అవిన్యా కాన్సెప్ట్‌తో టాటా మోటార్స్ ఈవీ కార్లు తయారవుతాయి. ఇవి ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా ఇంటీరియర్‌గా స్పేసియస్‌గా ఉంటాయి. అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్, కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉంటాయి. వీటిల్లో శక్తిమంతమైన కెపాసిటీ గల కార్లను వినియోగదారులకు అందించడానికి అత్యంత సమీకృత ప్రొపల్షన్ సిస్టమ్ (సెల్ టూ ప్యాక్ బ్యాటరీ టెక్నాలజీ, బ్యాటరీ మేనేజ్మెంట్ అండ్ చార్జింగ్ సిస్టమ్) అందిస్తారు. జేఎల్ఆర్ ఈఎంఏ ప్లాట్‌ఫామ్‌తో సహకార ఒప్పందం కుదిరినందుకు సంతోషంగా ఉందని టీపీఈఎం చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్-హెచ్వీ ప్రోగ్రామ్స్ హెడ్ ఆనంద్ కులకర్ణి అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

