Asian Markets | లాభాల్లో ఆసియా స్టాక్ మార్కెట్లు.. 5శాతం పెరిగిన నిక్కీ..!
Asian Markets | టారిఫ్ యుద్ధం మధ్య ప్రపంచవ్యాప్తంగా సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అయితే, ఒక రోజులోనే మార్కెట్లలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆసియా మార్కెట్లు మంగళవారం మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.
Asian Markets | టారిఫ్ యుద్ధం మధ్య ప్రపంచవ్యాప్తంగా సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అయితే, ఒక రోజులోనే మార్కెట్లలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆసియా మార్కెట్లు మంగళవారం మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. జపాన్ నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ నిన్న 8శాతం పడిపోగా.. మంగళవారం 5.5శాతం పెరుగుదలను నమోదు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై ప్రతీకార సుంకాల ప్రకటించిన విషయం తెలిసిందే. సుంకాలపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో యూఎస్ మార్కెట్లు సహా ఆసియా మార్కెట్లన్నీ దారుణంగా పడిపోయాయి. జపాన్ టోక్యోలో మార్కెట్ మంగళవారం ప్రారంభమైన అరగంట తర్వాత.. నిక్కీ 225 పాయింట్లు పెరిగి 32,819.08 పాయింట్లకు చేరుకుంది. దక్షిణ కొరియా కోస్పి సైతం 2 శాతం పెరిగింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు సైతం లాభాల్లో మొదలవడం విశేషం.
సోమవారం ఆసియా మార్కెట్లు ప్రారంభంలోనే భారీగా పడిపోయాయి. హాంకాంగ్ స్టాక్‌లు 13.2శాతం క్షీణించాయి. 1997 ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత సోమవారం మార్కెట్‌కు బ్లాక్ మండేగా నిలిచింది. సోమవారం ఎస్ఎండ్పీ 500 0.2శాతం పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 349 పాయింట్లు పతనమైంది. నాస్డాక్ కాంపోజిట్ 0.1శాతం లాభపడింది. మూడు సూచీలు భారీ నష్టాల్లోనే మొదలయ్యాయి. ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో పతనంతో.. డౌ జోన్స్ 1,700 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత దాదాపు 900 పాయింట్లు లాభపడింది. ఎస్అండ్పీ 500 4.7శాతం నష్టాల నుంచి లాభాల్లోకి దూసుకెళ్లింది. చాలా సంవత్సరాల తర్వాత నష్టాల నుంచి లాభాల్లోకి చేరుకోవడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

