టీ-వర్క్స్‌తో డసాల్ట్ దోస్తీ
ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ డసాల్ట్ సిస్టమ్స్.. టీ-వర్క్స్‌తో జట్టు కట్టింది. ఈ క్రమంలోనే ఇక్కడ స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు బుధవారం ఇరు సంస్థల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి మాట్లాడుతూ.. ఈ సీవోఈలో సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లకు అవసరమైన వివిధ రంగాల్లోని 3డీ డిజైన్లు అందుబాటులో ఉంటాయన్నారు.
- స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు
- కుదిరిన ఎంవోయూ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ డసాల్ట్ సిస్టమ్స్.. టీ-వర్క్స్‌తో జట్టు కట్టింది. ఈ క్రమంలోనే ఇక్కడ స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు బుధవారం ఇరు సంస్థల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి మాట్లాడుతూ.. ఈ సీవోఈలో సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లకు అవసరమైన వివిధ రంగాల్లోని 3డీ డిజైన్లు అందుబాటులో ఉంటాయన్నారు. స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులను తరువాతి స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రొటోటైప్‌లను రూపొందించడంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కార మార్గాలు ఈ కేంద్రంలో లభిస్తాయన్నారు.
అత్యాధునిక సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో కూడిన ఈ కేంద్రం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయుక్తంగా ఉండగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డసాల్ట్ సిస్టమ్స్ ఇండియా ఎండీ దీపక్ ఎన్జీ మాట్లాడుతూ.. కొత్త తరం స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవడానికి మా 3డీ ఎక్స్పీరియన్స్ సెంటర్ చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. ఆవిష్కరణలు చేసే సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో తోడ్పడగలదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డసాల్ట్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ సుచిత్ జైన్, సాలిడ్ వర్క్స్ ఇండియా మేనేజ్మెంట్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

