Swiggy | రెట్టింపైన స్విగ్గీ నష్టాలు.. తప్పని మరిన్ని లే-ఆఫ్స్?!
Swiggy | ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్పామ్ `స్విగ్గీ`నష్టాలు రూ.1,617 కోట్ల నుంచి రూ.3,629 కోట్లకు చేరడంతో మరిన్ని లేఆఫ్స్‌కు చాన్స్ ఉంది.
Swiggy | ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ `స్విగ్గీ`లో మలి విడుత లే-ఆఫ్స్ ఉన్నాయా?.. అంటే సంస్థ మేనేజ్మెంట్ నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022లో నష్టాలు రెట్టింపయ్యాయి. 2021లో రూ.1,617 కోట్ల నుంచి 2022లో రూ.3,629 కోట్లకు నష్టాలు పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చులు 131 శాతం పెరిగి రూ.9,574.5 కోట్లకు చేరాయి.
సంస్థ నష్టాలు రెట్టింపైన నేపథ్యంలో స్విగ్గీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేస్తూ.. `స్విగ్గీలో ఎటువంటి లే-ఆఫ్స్ లేవు. అక్టోబర్‌లో అన్ని స్థాయిల్లో ఉద్యోగుల పనితీరు, పెర్ఫార్మెన్స్ మదింపు పూర్తి చేశాం. అన్ని స్థాయిల ఉద్యోగులకు రేటింగ్స్, ప్రమోషన్లు కల్పించాం. ప్రతి స్థాయిలోనూ పనితీరు ఆధారంగా ఉద్యోగుల తొలగింపు ఉంటుంది` అని పేర్కొన్నారు. జనవరి నుంచి 250 మందికి పైగా సిబ్బందిని స్విగ్గీ తొలగిస్తుందని గత నెలలో వార్తలొచ్చాయి. మొత్తం సంస్థ సిబ్బందిలో ఐదు శాతం మందికి ఉద్వాసన పలుకుతుందని ఆ వార్తల సారాంశం.
2021లో రూ.2,547 కోట్ల ఆదాయం సంపాదించుకున్న స్విగ్గీ.. 2022లో 2.2 రెట్లు పెంచుకుని రూ.5,705 కోట్లకు చేరుకున్నది. మొత్తం కంపెనీ ఖర్చులో ఔట్ సోర్సింగ్ సపోర్ట్ కాస్ట్ 24.5 శాతం ఉంటుందని ఎన్‌ట్రాకర్ అనే సంస్థ అంచనా. ఔట్ సోర్సింగ్ సపోర్ట్ కాస్ట్ విభాగం ఖర్చులు 2021లో రూ.1,031 కోట్లు కాగా, 2022లో రూ.2,350 కోట్లకు (2.3 రెట్లు) పెరిగింది. అడ్వర్టైజింగ్, ప్రమోషనల్ ఖర్చులు నాలుగు రెట్లు పెరిగి రూ.1,848.7 కోట్లకు చేరాయి.
ఇన్వెస్టర్ సంస్థ `ఇన్వెస్కో` సారధ్యంలో 700 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకున్న తర్వాత 2022 చివరి త్రైమాసికంలో స్విగ్గీ `డెకాకార్న్ (10 బిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువ పెట్టుబడులు ఉన్న స్టార్టప్ సంస్థ)` హోదా తెచ్చుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

