Swiggy Instamart | ఫుడ్‌తోపాటు ఇతర వస్తువుల డెలివరీ.. అందుకోసం స్విగ్గీ ఏం చేసిందంటే..?!
Swiggy-Instamart | ఫుడ్ డెలివరీతోపాటు గ్రాసరీ, స్పోర్ట్స్ గూడ్స్, ఫుట్ వేర్ తదితర వస్తువులను కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేసేందుకు స్విగ్గీ.. తన అనుబంధ ఇన్ స్టామార్ట్ తో జత కట్టింది.
Swiggy Instamart | ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘స్విగ్గీ (Swiggy)’ తన అనుబంధ క్విక్-కామర్స్ ‘ఇన్‌స్టామార్ట్’తో తన వ్యాపార విస్తరణ దిశగా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి వరకూ ఫుడ్, రోజువారీ గ్రాసరీ వస్తువులను మాత్రమే పంపిణీ చేసిన ఇన్‌స్టామార్ట్ ఇక దుస్తులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్టేషనరీ సహా 35 రకాల వస్తువులను డెలివరీ చేయనున్నది. ఇందుకోసం తన రిటైల్ విభాగం ‘స్విగ్గీ మాల్ (Swiggy Mall)’ను ఇన్స్టామార్ట్తో లింక్ చేస్తున్నట్లు తెలిపింది.
ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే స్పోర్ట్స్ వస్తువులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ పరికరాలు, బొమ్మలు, స్టేషనరీతోపాటు పలు రకాల వస్తువులను సరఫరా చేసే ప్లాట్ ఫామ్ ‘స్విగ్గీమాల్’. బుక్ చేసిన గంటలోపే సంబంధిత కస్టమర్‌కు డెలివరీ చేయడం దీని స్పెషాలిటీ. ఇప్పటికే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో స్విగ్గీమాల్ తన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దేశంలో 25కి పైగా నగరాల్లో ఇన్‌స్టామార్ట్ సేవలందిస్తున్నది. తాజాగా స్విగ్గీ అనుబంధ స్విగ్గీమాల్, ఇన్‌స్టామార్ట్ మధ్య అనుసంధానించిన 35 పై చిలుకు క్యాటగిరీల ఉత్పత్తులను ఆర్డర్ చేయొచ్చునని స్విగ్గీ ఇన్ స్టామార్ట్ హెడ్ ఫణి కిషన్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

