జనప్రియ ప్రాజెక్ట్‌లో ‘స్వామి 1’ రూ.136 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్: కరోనా సంక్షోభం వల్ల నిలిచిపోయిన గృహ ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నది. హైదరాబాద్‌లోని జనప్రియకు చెందిన గేటెడ్-కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో ‘నిలిచిపోయిన సరసమైన, మధ్య-ఆదాయ గృహాల ప్రాజెక్టుల నిధుల కోసం ఏర్పాటైన ప్రత్యేక విండో 1’ (స్వామి I) రూ.136 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో సైనిక్ పురి సమీపంలో 8.21 ఎకరాల్లో విస్తరించిన జనప్రియ సితారా-లేక్‌ఫ్రంట్ నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.
హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో సైనిక్ పురి ఒకటి. జనప్రియ అభివృద్ధి చేస్తున్న పూర్తి ఆమోదిత ప్రాజెక్ట్‌లో 1.256 మిలియన్ చదరపు అడుగుల విక్రయించే ప్రాంతం ఉన్నది. అయితే కరోనా ప్రభావం వల్ల నిధుల కొరత ఏర్పడింది. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తి కోసం మొత్తం రూ.149.62 కోట్లు అవసరం కాగా, SWAMIH ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 1 (స్వామి 1) ఇందులో రూ .136 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన ప్రేరణ ఇస్తుందని జనప్రియ భావిస్తున్నది.
సైనిక్‌పురిలో సితారా-లేక్‌ఫ్రంట్ ప్రాజెక్టులో డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్లు కలిగిన ఆరు టవర్లను జనప్రియ నిర్మిస్తున్నది. ఇప్పటికే 338 అపార్ట్మెంట్లను అందజేసింది. SWAMIH ద్వారా నిధుల మంజూరుతో ప్రాజెక్ట్ ప్రతిపాదిత తదుపరి దశలోని 1502 అపార్ట్‌మెంట్స్‌ను రానున్న 12 నుంచి 30 నెలల్లో డెలివరీ చేయనున్నది.
జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ ఛైర్మన్ కె. రవీందర్ రెడ్డి అంచనా ప్రకారం మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణం 36 నెలల్లో పూర్తవుతుంది. మొత్తం 10 బ్లాక్‌లలో 2,245 గృహాలు అందుబాటులోకి వస్తాయి. ముంబైకి చెందిన నక్షత్ర రాయ్, ఆయన బృందం నేతృత్వంలోని మధ్యవర్తి భాగస్వాములు ఈ ప్రాజెక్టు లావాదేవీకి పెట్టుబడి బ్యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.
SWAMIH అనేది కేటగిరీ II ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి. 2019 సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రకటించగా అదే ఏడాది నవంబర్‌లో కేబినెట్ ఆమోదించింది. దీంతో నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావడం కోసం రూ.12,500 కోట్ల మూలధనంతోపాటు గ్రీన్-షూ ఎంపికలో భాగంగా అదనంగా మరో రూ.12,500 కోట్లను కేంద్రం అందించనున్నది.
దేశవ్యాప్తంగా 57,000 ఇండ్లు, అపార్ట్మెంట్లను పూర్తి చేయడానికి అవసరమైన 93 ప్రాజెక్టులకు సహాయార్థం కేంద్ర నిధికి తుది ఆమోదం తెలిపింది. మరో 142 ప్రాజెక్టులు ప్రాథమిక అనుమతి పొందాయి. దీంతో మరో 78,000 ఇండ్లు పూర్తి కావడానికి ఇది దోహదపడనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

