BharatPe Suhail | భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా
BharatPe Suhail | భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేశారు. జనవరి 7 నుంచి ఆయన స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా సేవలందించనున్నారు. సుహైల్ స్థానంలో సీఎఫ్ఓ నలిన్ నేగికి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు.
BharatPe Suhail | ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేశారు. తాత్కాలిక సీఈఓగా ప్రస్తుత సీఎఫ్ఓ నలిన్ నేగీని సంస్థ నియమించింది. సుహైల్ సమీర్ ఈ నెల 7 నుంచి భారత్‌పే వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరించనున్నారు. కాగా, ఇటీవలికాలంలో భారత్‌పే నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నతస్థాయి ఉద్యోగులు వైదొలిగారు.
భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానంలో 2022 మార్చిలో సుహైల్ సమీర్ నియమితులయ్యారు. తనపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అష్నీర్ గ్రోవర్ కంపెనీకి రాజీనామా చేశారు. కాగా, కంపెనీ సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేసినట్లు భారత్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సీఎఫ్ఓ నలిన్ నేగిని తాత్కాలిక సీఈఓగా నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నది. జనవరి 7 నుంచి సమీర్ కంపెనీకి స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా కొనసాగుతారు.
ఇలాఉండగా, గత నెలలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, పోస్ట్‌పే హెడ్ నెహుల్ మల్హోత్రా, లెండింగ్ అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రజత్ జైన్ కంపెనీకి రాజీనామా చేశారు. అలాగే, కంపెనీ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ నిషిత్ శర్మ జూన్‌లో రాజీనామా చేయగా.. భారత్‌పే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సత్యం నాథని, కంపెనీ టెక్నాలజీ, ఉత్పత్తుల విభాగాలను చూస్తున్న కొలాడియా కూడా అదే నెలలో కంపెనీని విడిచిపెట్టారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

