గురువారం 28 మే 2020
Business - Apr 30, 2020 , 00:13:32

ఆరు వారాల గరిష్ఠానికి మార్కెట్లు

ఆరు వారాల గరిష్ఠానికి మార్కెట్లు

ముంబై, ఏప్రిల్‌ 29: స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక, బ్యాంకింగ్‌, ఐటీ రంగాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను లాభాలవైపు నడిపించాయి. ఏప్రిల్‌ నెలకుగాను ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్‌ కాంట్రాక్టు గడువు ముగియడంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. ఇంట్రాడేలో 800 పాయింట్ల స్థాయిలో లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 605.64 పాయింట్ల లాభంతో 32,720.16 వద్ద ముగిసింది. దీంతో 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ ఆరు వారాల గరిష్ఠ స్థాయిని తాకినట్లు అయింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 172.45 పాయింట్లు అందుకొని 9,553.35 వద్ద స్థిరపడింది. మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం అత్యధికంగా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ 7.07 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలువగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 4.87 శాతం లాభపడింది. అలాగే హెచ్‌సీఎల్‌ టెక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ల షేర్లు నాలుగు శాతానికి పైగా బలపడ్డాయి.


logo