Stock Market | స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు.. కారణాలు ఇవే..!
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో లాభాల జోరు కొనసాగుతున్నది. కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలు, దిగివస్తున్న చమురు ధరలు (Oil prices), స్టాక్స్‌పై ఎల్టీసీజీ తొలగింపునకు సెబీ ప్రతిపాదన వంటి పరిణామాలతో మంగళవారం నాటి సెషన్లో దేశీయ సూచీలు దూసుకెళ్తున్నాయి.
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో లాభాల జోరు కొనసాగుతున్నది. కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలు, దిగివస్తున్న చమురు ధరలు (Oil prices), స్టాక్స్‌పై ఎల్టీసీజీ తొలగింపునకు సెబీ ప్రతిపాదన వంటి పరిణామాలతో మంగళవారం నాటి సెషన్లో దేశీయ సూచీలు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ (Sensex) 750 పాయింట్లకుపైగా ఎగబాకగా నిఫ్టీ (Nifty) 23,600 మార్క్ దాటి పరిగెడుతున్నది.
ఉదయం 11.50 గంటల సమయంలో సెన్సెక్స్ 750 పాయింట్లు పెరిగి 76,442 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 204 పాయింట్ల లాభంతో 23,645 వద్ద కొనసాగుతున్నది. దాంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లకుపైగా పెరిగి రూ.486 లక్షల కోట్లకు చేరింది. ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియారంగ సూచీలు ఒక శాతానికిపైగా పెరిగాయి.
దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడిదార్లను ఆకర్షించడానికి, దేశీయ మ్యూచువల్ ఫండ్లకు ఊరట కల్పించేందుకు ఈక్విటీ ప్రతిఫలాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నురద్దు చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం విదేశీ మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. క్రితం రోజుతో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగినప్పటికీ ఇటీవలి కాలంలో రికార్డు స్థాయి రేట్లతో పోలిస్తే తక్కువ ఉండటం ఊరటనిస్తోంది. భారత ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. సోమవారం వీరు రూ.3,115 కోట్ల మేర మన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడుతున్నది. నేటి మార్కెట్లో మన కరెన్సీ విలువ 12 పైసలు బలపడి 94.72 వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- fmcg
- nifty
- Sensex
- stock market
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు.. కారణాలు ఇవే..!
Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
బాచారం ఉర్సు వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

