Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Stock Market : భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1534 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 375 పాయింట్ల లాభాల్ని చవిచూసింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1534 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 375 పాయింట్ల లాభాల్ని చవిచూసింది. దీంతో స్టాక్ మార్కెట్ విలువ గురువారం ఒక్కరోజే ఏకంగా 2 శాతంపైగా పెరిగింది. ఐటీ షేర్లకు మద్దతు లభించడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ పెరగడం వంటి కారణాలు మార్కెట్‌పై సానుకూల ఫలితాన్ని చూపాయి.
దీంతో స్టాక్ మార్కెట్ లాభాలబాట పట్టింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,534 పాయింట్లు (2.11 శాతం) లాభపడి 74,315. 61 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 375 పాయింట్లు (1.66 శాతం) లాభంతో 22,997.35 వద్ద ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ కొనసాగింది. టెక్ మహీంద్రా అత్యధికంగా 4.61 శాతం లాభపడింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 4.17 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.03 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.94 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.58 శాతం లాభపడ్డాయి.
బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ 100.. 1.26 శాతం లాభపడగా, నిఫ్టీ 200 0.93 శాతం, నిఫ్టీ 500 0.65 శాతం లాభపడగా.. నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 మాత్రం 0.24 శాతం నష్టపోయింది. అలాగే, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.36 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.31 శాతం నష్టాల్లో ముగిశాయి. మరోవైపు రూపాయి 0.2 శాతం బలపడింది. డాలర్‌తో రూపాయి మారక విలువ 94.92 వద్ద కొనసాగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక డాలర్ పైగా తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 104 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

