Elon Musk | మస్క్ స్పేస్ ఎక్స్‌లో ఉద్యోగులకు ఉద్వాసన.. అసలేమైంది?!
Elon Musk | ఎలన్‌మస్క్ తీరును విమర్శించిన స్పేస్ ఎక్స్ ఉద్యోగులను సంస్థ యాజమాన్యం తొలగించిందని సమాచారం.
Elon Musk | స్పేస్ ఎక్స్ సంస్థ తీరుపైనా.. ఆ సంస్థ సీఈవో ఎలన్‌మస్క్ తీరుపై విమర్శలు చేసిన ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారని సమాచారం. సంస్థ ఉద్యోగుల మధ్య గల ఇంటర్నల్ చాట్ సిస్టమ్‌లో టెస్లా యాజమాన్యం తీరు, ఎలన్‌మస్క్ తీరుపై బహిరంగ లేఖలో దుమ్మెత్తి పోశారు. ఆయన వైఖరి తమకు ఇబ్బందికరంగా మారిందని ఆరోపించారు. ఈ సంగతి తెలిసిన ఎలన్‌మస్క్.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించారని సమాచారం. అర్థంతరంగా తమ తొలగింపుపై సీఈవో ఎలన్‌మస్క్ తీరు పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యవహార శైలి సరిగ్గా లేదని చెబుతున్నారు.
తమ ఉద్వాసనకు వ్యతిరేకంగా స్పేస్ ఎక్స్ ఉద్యోగులు నేషనల్ లేబర్ రిలేషన్ బోర్డు (ఎన్ఎల్ఆర్బీ)లో పిటిషన్ దాఖలు చేయొచ్చు. అలా పిటిషన్ దాఖలు చేస్తే యాజమాన్యం లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిందని అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తొలగించిన ఉద్యోగుల పునః నియామకం, వారికి పరిహారం చెల్లించాల్సి వస్తుందంటున్నారు. కోర్టులో కేసు ఫైల్ అయితే.. ఉద్యోగులను అకస్మికంగా తొలగించడానికి కారణాలను స్పేస్ ఎక్స్ యాజమాన్యం వివరించాల్సి ఉంటుందని సీటెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షార్లెట్ గార్డెన్ అన్నారు.
కానీ, ఎలన్‌మస్క్‌ను విమర్శించినందుకే ఉద్యోగులను తొలగించారన్న ఆరోపణలపై స్పేస్ ఎక్స్ యాజమాన్యం స్పందించలేదు. కానీ.. మస్క్ తీరును ఖండించిన ఉద్యోగులను స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్ తొలగించారని సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

