SGB | సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతున్నది. వీటిలో పెట్టుబడులు పెట్టాలని చాలామంది మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఎలా ముందుకెళ్లాలి? అన్నదానిపై అవగాహన లేక వెనుకడుగేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
SGB | సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతున్నది. వీటిలో పెట్టుబడులు పెట్టాలని చాలామంది మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఎలా ముందుకెళ్లాలి? అన్నదానిపై అవగాహన లేక వెనుకడుగేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. నిజానికి ఎస్‌జీబీల్లో పెట్టుబడికి భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, యూనివర్సిటీలు, దేశీయ సంస్థలు అర్హులు. అయితే ఆన్లైన్లో వీటిని కొనడం చాలా సులభం. ద్వారా దీన్ని పూర్తి చేయవచ్చు. పైగా ఆన్లైన్లో ఎస్జీబీలను తీసుకుంటే జారీ చేసిన ధర కంటే గ్రాముపై రూ.50 తగ్గుతుంది. ఇక ఒక గ్రాము గోల్డ్ యూనిట్లలో వీటిని లెక్కిస్తారన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు..
ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా..
- మీ పాస్‌వర్డ్‌తో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వండి
- మెయిన్ మెనూ నుంచి ‘ఈ-సర్వీస్’పై క్లిక్ చేయండి
- ‘సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం’ను ఎంచుకోండి
- హెడర్ ట్యాబ్ నుంచి ‘పర్చేజ్’ ఆప్షన్‌ను తీసుకోవాలి
- మీరు తొలిసారి మదుపరైతే తప్పక రిజిస్టర్ చేసుకోవాలి. హెడర్ ట్యాబ్ నుంచి ‘రిజిస్టర్’ను ఎంచుకోవాలి. ఆపై టర్మ్స్ మరియు కండీషన్స్ చూసుకుని ‘ప్రొసీడ్’ అవ్వాలి
- సబ్స్క్రిప్షన్ పరిమాణాన్ని పేర్కొనాలి. మీకు సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్, ఇతరత్రా వివరాలనూ ఇవ్వాలి
- డీమ్యాట్ ఖాతా ఉన్న ఎన్ఎస్డీఎల్/సీడీఎస్ఎల్ నుంచి డిపాజిటరీ పార్టిసిపెంట్ ఎంచుకోండి
- డీపీ ఐడీ, క్లయింట్ ఐడీలను ఎంటర్ చేసి ‘సబ్మిట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- మీరిచ్చిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా? అని చూసుకుని ‘సబ్మిట్’ ట్యాబ్‌పై నొక్కండి
- మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ‘కన్ఫమ్’పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత తెరుచుకునే కొత్త పేజీలో మీ సబ్స్క్రిప్షన్ వివరాలన్నీ కనిపిస్తాయి.
ఎస్‌జీబీలతో లాభాలు
- బంగారం ధరల ఆధారంగా వచ్చే రాబడులపై అదనంగా 2.5 శాతం వార్షిక వడ్డీరేటు.
- ఎస్‌జీబీల కాలపరిమితి 8 ఏండ్లు. 5, 6, 7 ఏండ్లలోనూ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు.
- మీ పెట్టుబడికి, దానిమీద వచ్చే రాబడికి సావరిన్ గ్యారంటీ ఉంటుంది.
- ఎనిమిదేండ్లు దాటిన తర్వాత రిడెంప్షన్‌పై మూలధన లాభాల పన్ను మినహాయింపు .
- భారతీయ రూపాయల్లోనే రిడెంప్షన్ ధరను నిర్ధారిస్తారు. భారతీయ బులియన్, జ్యుయెల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్ గడిచిన మూడు రోజుల్లో ప్రకటించిన 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధర సగటుపై ఈ ధర ఆధారపడి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

