Keeway K-Light 250V Bike | బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి టూ వీలర్!
Keeway K-Light 250V Bike | ఎన్ఫీల్డ్, హోండా, యెజ్డీ, బెనెల్లిలకు పోటీగా హంగేరీ టూవీలర్స్ సంస్థ కీవే.. కీ-లైట్ 250వీ బైక్ ఆవిష్కరించింది.
Keeway K-Light 250V Bike | రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, ఆర్ఈ మీటోర్ 350, హోండా హ్యాపీనెస్ సీబీ 350, యెజ్డీ రోడ్‌స్టర్, బెనెల్లి ఇంపీరియల్ 400 వంటి బైక్‌లకు పోటీగా వస్తోంది హంగేరికి చెందిన టూ వీలర్ సంస్థ కీవే భారత్. బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో రూపుదిద్దుకున్న కీవే కీ-లైట్ 25వీ బైక్‌ను మంగళవారం విపణిలో ఆవిష్కరించారు. 5-స్పీడ్ గేర్ బాక్స్‌తోపాటు 20 లీటర్ల ఇంధన సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉండటంతో దీనిపై లాంగ్ డ్రైవ్‌కూ వెళ్లొచ్చు.
ఎయిర్ కూల్డ్ 250సీసీ వీ-ట్విన్ ఇంజిన్, 8,500 ఆర్పీఎం వద్ద 18.7 హెచ్‌పీ, 5500 ఆర్పీఎం వద్ద 19 ఎన్ఎం టార్చి విడుదల చేసే ఈ బైక్ ధర రూ.1.9 లక్షల నుంచి రూ.2.2 లక్షల మధ్య ఉంటుంది. మూడు కలర్ల ఆప్షన్లలో కీవే కే-లైట్ 250వీ బైక్ లభిస్తుంది. మ్యాట్టే బ్లూ కలర్ వేరియంట్ రూ.2.89 లక్షలు, మ్యాట్టే డార్క్ గ్రే రూ.2.99 లక్షలు, మ్యాట్టె బ్లాక్ రూ.3.09 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. డ్యూయల్ ఏబీఎస్‌తోపాటు ముందూ వెనుక డిస్క్ బ్రేక్‌లతో వస్తోంది బైక్.
స్పీడ్‌పై లిమిట్, జియో ఫెన్స్, రిమోట్ ఇంజిన్-ఆఫ్ తదితర ఫీచర్లు కీ-లైట్ 25వీ బైక్‌లో లభిస్తున్నాయి. 249సీసీ సామర్థ్యంతో వస్తున్న ఈ బైక్ డెలివరీ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానున్నది. ఈ ఏడాది మరో ఐదు బైక్‌లు విపణిలోకి తేనున్నట్లు కీవే ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

